స్కానింగ్ సెంటర్‌లో వికృత చేష్టల కేసు.. స్కానింగ్ కేంద్రాల పరిశీలనకు 50 బృందాలు

రెండు సెంటర్లలో ఒకే వ్యక్తి మహిళల వీడియోలు తీసినట్లుగా పోలీసులు గుర్తించారు.

స్కానింగ్ సెంటర్‌లో వికృత చేష్టల కేసు.. స్కానింగ్ కేంద్రాల పరిశీలనకు 50 బృందాలు

Updated On : May 30, 2024 / 5:38 PM IST

Nizamabad Ayyappa Scanning Center : నిజామాబాద్ అయ్యప్ప స్కానింగ్ సెంటర్ కేసులో తీగ లాగితే డొంక కదులుతోంది. అయ్యప్ప స్కానింగ్ సెంటర్ తో పాటు మరో బడా హాస్పిటల్ లో మహిళల ఫొటోలు తీశాడు ప్రశాంత్. వాటితో బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డాడు. ప్రశాంత్.. మరో ఆసుపత్రిలోనూ మహిళల వీడియోలు తీసినట్లు గుర్తించారు పోలీసులు. స్కానింగ్ కేంద్రాల పరిశీలనకు 50 బృందాలను ఏర్పాటు చేశారు కలెక్టర్. రెండు సెంటర్లలో ఒకే వ్యక్తి మహిళల వీడియోలు తీసినట్లుగా పోలీసులు గుర్తించారు.

డాక్టర్ చాంబర్ లో సెతస్కోప్ వేసుకుని డాక్టర్ లా బిల్డప్ ఇస్తూ ఆసుపత్రికి వచ్చే పెషెంట్లకు తాను డాక్టర్ నని ప్రశాంత్ చెప్పుకున్న సందర్భాలూ ఉన్నాయి. జిల్లాలో 180 స్కానింగ్ సెంటర్లు ఉండగా వాటి పరిశీలనకు దాదాపు 50 బృందాలను జిల్లా కలెక్టర్ హనుమంతు ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయి విచారణకు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే స్కానింగ్ సెంటర్ ఆపరేటర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. 10 రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని స్కానింగ్ సెంటర్ కు సైతం జిల్లా వైద్య శాఖ అధికారులు నోటీసులు ఇచ్చారు.

జిల్లా వైద్య శాఖ అధికారి దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. స్కానింగ్ సెంటర్లలో పరిస్థితి ఏ విధంగా ఉంది? మహిళల భద్రత ఏ విధంగా ఉంది? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇందుకోసం నలుగురు మహిళా డాక్టర్లతో బృందాన్ని ఏర్పాటు చేశారు.

Also Read : మా ఆయనకు అమ్మాయిల పిచ్చి.. పబ్జీలో అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నాడు..