వారి నిర్లక్ష్యమే ప్రియాంకను బలి తీసుకుంది : డాక్టర్ హత్యాచారం కేసులో కీలక విషయాలు

వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంకా రెడ్డి హత్చాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దారుణాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆవేదనతో కన్నీళ్లు పెడుతున్నారు.

  • Published By: veegamteam ,Published On : December 1, 2019 / 05:49 AM IST
వారి నిర్లక్ష్యమే ప్రియాంకను బలి తీసుకుంది : డాక్టర్ హత్యాచారం కేసులో కీలక విషయాలు

Updated On : December 1, 2019 / 5:49 AM IST

వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంకా రెడ్డి హత్చాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దారుణాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆవేదనతో కన్నీళ్లు పెడుతున్నారు.

వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంకా రెడ్డి హత్చాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దారుణాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆవేదనతో కన్నీళ్లు పెడుతున్నారు. నిందితుల్ని ఉరి తీయాలంటూ… దేశమంతా ఒకే తాటిపైకి వచ్చింది. ఆగ్రహం.. ఆక్రోశం… ఆవేదన.. వెల్లువెత్తాయి. నిందితుల్ని వదిలేస్తే… ముక్క మిగలకుండా చంపేసే పరిస్థితి నెలకొంది. అయితే ఈ హత్యాచార కేసులో కీలక విషయాలు వెలుగులోకొస్తున్నాయి. వేర్వేరు అంశాల్లో నిబంధనలు ఉల్లంఘించి… నిందితులను రెండుసార్లు వదిలేయడమే ప్రియాంక పాలిట శాపమైంది అనే విషయం బయటపడింది. కొందరి నిర్లక్షమే ప్రియాంకను తిరిగిరాని లోకాలకు పంపేసింది. దుర్మార్గుల చేతిలో బంగారు భవిష్యత్తు బలైంది.

డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేదు.. పైగా ఓవర్‌ లోడ్‌.. అలాంటి లారీ కనిపిస్తే ఆర్టీఓ ఏం చేయాలి…? స్వాధీనం చేసుకోవాలి. కానీ మహబూబ్‌నగర్‌ ఆర్టీఓ ఆ పని చేయలేదు. ముందు హైవేపై అక్రమ పార్కింగ్‌.. తర్వాత సర్వీస్‌ రోడ్డులో గంటల తరబడి లారీ… అప్పుడు పెట్రోలింగ్‌ పోలీసులు ఏం చేయాలి…? లారీని తీసేలా చర్యలు తీసుకోవాలి. కానీ వారు కూడా ఆ పని చేయలేదు. ఈ రెండు ఘటనల్లో ఎవరి పని వారు సక్రమంగా నిర్వర్తించి ఉంటే.. ప్రియాంక ప్రాణాలతోనే ఉండేది. అక్కడ ఆర్టీఓ, ఇక్కడ పోలీసులు తమ విధులు కచ్చితంగా పాటించి ఉంటే ఓ అమాయక అతివ..ఉన్మాదుల పశువాంఛకు బలయ్యేది కాదు.

ప్రియాంక హత్యాచారం జరగడానికి ఒకరోజు ముందు నిందితులు వస్తున్న లారీని మహబూబ్‌నగర్‌ ఆర్టీఓ పట్టుకున్నారు. సరైన పత్రాలు లేకపోవడం, పైగా ఓవర్‌ లోడ్‌ ఉండటంతో నిబంధనల ప్రకారం దానిని సీజ్‌ చేయాల్సి ఉండగా.. ఆర్టీఓ ఆ పని చేయకుండా తాపీగా వదిలేసి వెళ్లిపోయారు. ఆ నిర్లక్షమే ప్రియాంకను బలి తీసుకుంది. ఆ ఆర్టీఓ అలసత్వమే… రాక్షసుల చేతిలో ప్రియాంకను వదిలేసింది. అనంతరం నిందితులు తొండుపల్లి చేరుకుని లారీని హైవేపై అక్రమంగా పార్క్‌ చేశారు.

ఘటన జరగడానికి 12 గంటల ముందు అటుగా వచ్చిన హైవే పెట్రోలింగ్‌ పోలీసులు.. లారీని అక్కడి నుంచి తీసేయాలని హెచ్చరించి వెళ్లిపోయారు. ఏదో చేయాలా వద్దా… అన్నట్లుగా తమ పని చేసి వెళ్లిపోయారు. ఈ పెట్రోలింగ్ పోలీసుల నిర్లక్ష్యం కూడా ప్రియాంకను మింగేసింది. పోలీసులు అలా చెప్పి ఇలా వెళ్లిపోవడంతో… నిందితులు తొండుపల్లి టోల్‌ప్లాజా గేట్‌ దగ్గరున్న సర్వీస్‌ రోడ్డులోనే లారీని నిలిపి అలాగే ఉంచారు. 

తొండుపల్లి టోల్‌ప్లాజా దగ్గర చాలాసేపు లారీ ఉండటం.. ఆపై అక్కడకి వచ్చిన ప్రియాంకను నిందితులు చూడటంతో వారి మదిలో దుర్బుద్ధి పుట్టి పథకం ప్రకారం ఘాతుకానికి తెగబడ్డారు. అతి కిరాతకానికి ఒడిగట్టారు. దేశంలో ఆడపిల్ల భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేశారు నీచులు. ఒకవేళ ఆర్టీఓ ఆ లారీని సీజ్‌ చేసినా.. సర్వీస్‌ రోడ్డులో కూడా అంతసేపు లారీని నిలపకుండా పోలీసులు చర్యలు తీసుకున్నా.. ఈ దురాఘతం జరిగి ఉండేది కాదని రిమాండ్‌ రిపోర్ట్‌ చూస్తే అర్థమవుతుంది. ఆ రెండు శాఖల అధికారుల నిర్లక్ష్యంపై అందరి కడుపు మండిపోతుంది.