Old Age Mother : ప్రియురాలితో కలిసి తల్లిని ఇంట్లోంచి గెంటేసిన తనయుడు

వృధ్దురాలినని కుడా చూడకుండా ప్రియురాలితో కలిసి తనను కన్నకొడుకు ఇంటినుంచి గెంటివేశాడనే ఆవేదనతో ఓ వృధ్ధ మహిళ పోలీసులను ఆశ్రయించింది.

Old Age Mother : ప్రియురాలితో కలిసి తల్లిని ఇంట్లోంచి గెంటేసిన తనయుడు

Old Age Mother

Updated On : September 27, 2021 / 11:08 AM IST

Old Age Mother :  వృధ్దురాలినని కుడా చూడకుండా ప్రియురాలితో కలిసి తనను కన్నకొడుకు ఇంటినుంచి గెంటివేశాడనే ఆవేదనతో ఓ వృధ్ధ మహిళ పోలీసులను ఆశ్రయించింది.

హైదరాబాద్ బర్కత్‌పురా దివాకర్ గార్డెన్స్ లో నివసించే   బి.హేమలత(65)కు శ్రీకాంత్ అనే కుమారుడు ఉన్నాడు.  శ్రీకాంత్ 2017 నుంచి సింధూరారెడ్డి అనే యువతితో సహజీవనం చేస్తున్నాడు. అప్పటి నుంచి తల్లిని పట్టించుకోకుండా నిర్ల్యక్ష్యంగా వ్యవహరించసాగాడు.

ఆమెను కొట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడు. దాంతో ఆమె అనాధ అయ్యింది. ఈ క్రమంలో గత మార్చి నెలలో పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు శ్రీకాంత్ ను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. తల్లిని బాగా చూసుకుంటానని చెప్పి బంజారాహిల్స్ రోడ్ నెంబరు 14లోని తన ఇంటికి తీసుకువచ్చాడు.

బాగా చూసుకుంటున్నట్లు నమ్మించి తల్లి పేరిట మీర్ పేట లో ఉన్న ఇంటిని అమ్మించి డబ్బులు తీసుకున్నాడు. ఆ తర్వాత నుంచి మళ్లీ తల్లిని బయటకు గెంటేశాడు. ఇప్పడు తనను చంపేందుకు కూడా వెనుకాడటంలేదని…ఇంట్లోంచి బయటకు తరిమేశారని ఆరోపిస్తూ తాజాగా హైమలత బంజారా హిల్స్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బంజారా హిల్స్ పోలీసులు శ్రీకాంత్, ఆమె ప్రియురాలు సింధూరా రెడ్డిలపై ఐపీసీ సెక్షన్‌ 509, ఎస్సీ, ఎస్టీ, సీనియర్‌ సిటిజన్స్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.