కూకట్పల్లిలో దారుణం.. ఫస్ట్ నైట్ రోజు మత్తు మందిచ్చి.. భార్యపై నలుగురితో అత్యాచారం
Kukatpally : కూకట్పల్లిలో అత్యంత భయానక ఘటన వెలుగు చూసింది. ఫస్ట్ నైజ్ నాడే భార్యకు మత్తు మందిచ్చి.. నలుగురితో అత్యాచారం చేయించాడో దుర్మార్గపు భర్త.
హైదరాబాద్ కూకట్పల్లిలో ఒక దారుణమైన ఘటన వెలుగుచూసింది. ఇప్పటికే ముగ్గురిని పెళ్లాడిన ఒక వ్యక్తి.. తాను హిందువుగా మారానని నమ్మించి ఒక యువతిని నాలుగో వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత పెళ్లైన మొదటి రాత్రే ఆమెకు మత్తుమందు ఇచ్చి.. నలుగురితో అత్యాచారం చేయించాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ దారుణం కూకట్పల్లి పరిధిలో జరిగింది. స్థానికంగా ఉండే యువతికి కొన్నాళ్ల క్రితం నిందితుడితో వివాహం జరిగింది. సదరు వ్యక్తి తాను హిందువుగా మారినట్లు నమ్మించి ఆమెను వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత అతడి నిజస్వరూపం బయటపడింది. ఫస్ట్ నైట్ రోజే మత్తుమందు ఇచ్చి నలుగురి చేత భార్యపై అత్యాచారం చేయించాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించాడు. పైగా అప్పటికే అతడికి మూడు వివాహాలు అయినట్లు తెలిసింది. దీంతో నవ వధువు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది.
మరింత దారుణమైన విషయం ఏంటంటే.. నిందితుడు ఆ యువతికి చెందిన ప్లాట్, బంగారం తీసుకోవడమే కాకుండా.. ఆమె పేరు మీద లోన్లు కూడా తీసుకున్నాడు. అతడికి హవాలా డబ్బుల వ్యవహారాల్లో కూడా సంబంధాలు ఉన్నట్లు బాధితురాలు వెల్లడించింది. వివాహం పేరుతో మోసం చేయడమే కాక.. తనపై అత్యాచారం చేయించాడని బాధితురాలు కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ (Zero FIR) నమోదు చేసి, కేసును బేగంపేట పోలీసులకు బదిలీ చేశారు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
