Greeshma Case : ప్రియుడిని హత్య చేసిన ప్రియురాలి కేసులో ట్విస్ట్.. లైసోల్ తాగి గ్రీష్మ ఆత్మహత్యాయత్నం
కేరళ తిరువనంతపురంలో ప్రియుడికి విషమిచ్చి ప్రియురాలు హత్య చేసిన కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ టాయ్ లెట్ లో లైజాల్ తాగి ప్రియురాలు గ్రీష్మ ఆత్మహత్యాయత్నం చేసింది.

Greeshma Case : కేరళ తిరువనంతపురంలో ప్రియుడికి విషమిచ్చి ప్రియురాలు హత్య చేసిన కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ టాయ్ లెట్ లో లైజాల్ తాగి ప్రియురాలు గ్రీష్మ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నం చేసింది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు గ్రీష్మను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.
తిరువనంతపురానికి చెందిన గ్రీష్మ(22) తన ప్రియుడు షరోన్ కు(23) విషమిచ్చి మర్డర్ చేసింది. కషాయంలో పెస్టిసైడ్ కలిపి ప్రియుడితో తాగించి మరీ కడతేర్చింది. గ్రీష్మ, షరోన్ ప్రేమించుకుంటున్నారు. అయితే, గ్రీష్మకు మరో యువకుడితో పెళ్లి ఫిక్స్ అయ్యింది. అతడిని పెళ్లి చేసుకుందామని గ్రీష్మ అనుకుంది. కానీ, బ్రేకప్ కు షరోన్ ఒప్పుకోలేదు. దీంతో షరోన్ వదిలించుకునేందుకు గ్రీష్మ తీవ్రంగా ప్రయత్నించింది. అప్పటికీ కుదరకపోవడంతో షరోన్ ను చంపాలని నిర్ణయించుకుంది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
ఈ నేపథ్యంలో షరోన్ ను అక్టోబర్ 14న ఇంటికి పిలిపించుకుంది గ్రీష్మ. పెస్టిసైడ్ కలిపిన కషాయం అతడికి ఇచ్చింది. అది తాగిన తర్వాత షరోన్ కు వాంతులయ్యాయి. 11 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన షరోన్ ఈ నెల 25న మృతి చెందాడు. అటు, గ్రీష్మ తనకు విషం ఇచ్చినట్లుగా షరోన్ కు ఎవరూ చెప్పలేదు. షరోన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఇది మెడికో లీగల్ కేసు అని పోలీసులు చెప్పారు. చనిపోవడానికి ముందు షరోన్ స్టేట్ మెంట్ ను రికార్డ్ చేశారు.
ఈ ఘటనలో గ్రీష్మ కుటుంబసభ్యుల పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసుని అన్ని కోణాల్లో విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ కేసుకి సంబంధించి పలువురి స్టేట్ మెంట్లు రికార్డ్ చేశామన్నారు. గ్రీష్మ, ఆమె కుటుంబసభ్యులే షరోన్ ను హత్య చేశారని, షరోన్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కొంతకాలం క్రితం విభేదాలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. ఈ క్రమంలో గ్రీష్మకు మరో యువకుడితో పెళ్లి కుదిరింది.