సహజీవనం పేరుతో సుఖాలనుభవించాడు….పెళ్ళనే సరికి పరార్

ప్రేమ పేరుతో దగ్గరై, సహజీవనమంటూ ఎంజాయ్ చేసాడు. పెళ్లనేసరికి పరారైన కామాంధుడు ఉదంతం బీహార్ లో వెలుగు చూసింది. బీహార్ రాజధాని పాట్నాలో నివసించే రాజేష్ అదే నగరంలోని సంజన అనే యువతితో 2018 నుంచి ప్రేమలో పడ్డాడు.
చాలాకాలం పాటు ఈ ప్రేమ పక్షులు పార్కుల్లో షికార్లు చేస్తూ రసాస్వాదనలో మునిగి తేలారు. తెలుగు సినిమా కధ లాగానే ఇక్కడ వీరి ప్రేమ విషయం అమ్మాయి తల్లి తండ్రులకు తెలిసి మందలించారు. ప్రేమ, గీమ, దోమ లేదు నోర్మూసుకుని ఇంట్లో కూర్చోమని.
పెద్దలు మందలిచిన విషయం సంజన, రాజేష్ కు ఫోన్ లో చెప్పింది. ఇంకే ముంది మనోడు హీరో లెవల్లో…. పారిపోయి వచ్చేయ్, పెళ్ళి చేసుకుని హ్యాపీగా ఉందామని చెప్పాడు. దీంతో ఆమె కట్టుబట్టలతో ఇంట్లోనుంచి పారిపోయి వచ్చేసింది.
సంజన రాగానే ఇద్దరూ కల్సి ఒక ఇల్లు తీసుకుని సహజీవనం చేయటం మొదలెట్టారు. కొన్నాళ్లకు ఎలాగూ పెళ్లి చేసుకోబోతున్నాం కదా.. అని శారీరకంగా దగ్గరై… రొమాన్స్ లో మునిగి తేలిపోయారు. ఇలా కొన్నాళ్లు ఆనందంలో తేలియాడి పోయారీ ప్రేమ జంట. ఒన్ ఫైన్ మార్నింగ్ సంజన నెల తప్పింది. ఇప్పుడే పిల్లలు వద్దని ఆమెకు నచ్చచెప్పి రాజేష్ సంజనకు అబార్షన్ చేయించాడు.
ఎన్నాళ్ళిలా సహజీవనం చేస్తాం.. పెళ్లి చేసుకుందామని సంజన రాజేష్ ను కోరటం మొదలుపెట్టింది. పెళ్లి మాట అనేసరికి రాజేష్ ఏదో ఒక కారణం చెప్పి దాట వేయటం మొదలెట్టాడు. ఇలా ఉండగా ఒకసారి వేరే ఊళ్లో పని ఉందని చెప్పి వెళ్లిన రాజేష్ ఇంక తిరిగి రాలేదు.
మర్నాడు ఉదయానికి కూడా ఇంటికి రాకపోవటంతో సంజన రాజేష్ సెల్ కు ఫోను చేసింది. ఫోన్ స్విచ్చాఫ్ చేసి ఉంది. ఆ తర్వాత ఎప్పుడూ చేసినా ఫోన్ స్విచ్చాఫ్ రావటంతో పోలీసులను ఆశ్రయించింది. కేస నమోదు చేసుకున్న పోలీసుల నిందితుడ్ని అరెస్టు చేసి కటకటాల్లోకి పంపారు. (ప్రధాని దీపాలు పెట్టమంటే.. గాల్లో కాల్పులు జరిపిన BJP లీడర్)