Payment Gateway Company: థానేలో పేమెంట్ గేట్‌వే కంపెనీ అకౌంట్ హ్యాక్.. రూ. 16,180 కోట్లు స్వాహా.. ఎలా జరిగిందంటే?
కొంతమంది వ్యక్తులు పేమెంట్ గేట్ వే సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ ఖాతాను హ్యాక్ చేసి వివిధ బ్యాంకు ఖాతాల నుంచి రూ. 16.180 కోట్ల విలువైన నగదును కొంతకాలంగా స్వాహా చేస్తున్నట్లు థానే పోలీసులు గుర్తించారు.

Payment Gateway Company
Payment Gateway Company Account Hacked: మహారాష్ట్రలోని థానే నగరంలో హ్యాకర్లు కోట్లు కొల్లగొట్టారు. శ్రీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేమెంట్ గేట్ వే సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ ఖాతాను హ్యాక్ చేసి రూ. 25వేల కోట్లు స్వాహా చేశారని పోలీసులకు ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు విచారణ చేపట్టగా.. తీగలాగితే డొంక కదిలినట్లుగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కొంతమంది వ్యక్తులు పేమెంట్ గేట్ వే సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ ఖాతాను హ్యాక్ చేసి వివిధ బ్యాంకు ఖాతాల నుంచి రూ. 16.180 కోట్ల నగదును కొంతకాలంగా స్వాహా చేస్తున్నట్లు థానే పోలీసులు గుర్తించారు. థానే క్రైం బ్రాంచ్ అధికారి ఫిర్యాదు మేరకు శుక్రవారం నౌపడ పోలీసులు సంజయ్ సింగ్, అమోల్ అందాలే, సమీర్ డిఘే, జితేంద్ర పాండేతో పాటు మరో వ్యక్తిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Read Also : Apartment: అపార్ట్‌మెంట్‌లో ఏ ఫ్లోర్‌లో ఫ్లాట్ కొనాలి.. మిడిల్ అయితే బెటరా?
నిందితుల్లో ఒకరైన జితేంద్ర పాండే వివిధ బ్యాంకుల్లో సుమారు పదేళ్లపాటు రిలేషన్ షిప్ అండ్ సేల్స్ మేనేజర్ గా పనిచేశాడు. అయితే, భారీ నగదు స్వాహా వ్యవహారంలో ఎక్కువ మంది నిందితులు ఉన్నారని, కొన్నేళ్లుగా సాగుతున్న వ్యవహారంలో పలు బ్యాంకులు, వ్యక్తులను ప్రభావితం చేసి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల విచారణ బృందం నిందితుల నుంచి అనేక నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ఈ కేసుపై విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు. అయితే, భారీ నగదు స్వాహా వ్యవహారంలో పోలీసులు ఇప్పటి వరకు ఎవరిని అరెస్టు చేయలేదు. ఈ విషయంపై పోలీసులు వివరణ ఇస్తూ.. దర్యాప్తు అధికారులు అనేక నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నందున దర్యాప్తు పురోగతిలో ఉందని తెలిపారు.