Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు, ఆ ప్రాంతాల్లో సెంటర్లు ఏర్పాటు చేసి..

రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు నలుగురు ఉన్నతాధికారులను అరెస్ట్ చేశారు.

Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు, ఆ ప్రాంతాల్లో సెంటర్లు ఏర్పాటు చేసి..

Phone Tapping Case

Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నల్గొండ, హైదరాబాద్, ఖమ్మంలో రెండు చోట్ల.. వరంగల్, సిరిసిల్లలో ట్యాపింగ్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. హైదరాబాద్ ఎస్ఐబీ కార్యాలయంతో పాటు జూబ్లీహిల్స్ లోనూ ట్యాపింగ్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు అనుమానిస్తున్నారు. ట్యాపింగ్ ను అదునుగా తీసుకుని పలువురు అధికారులు బరి తెగించారు. కానిస్టేబుల్ నుంచి డీసీపీ స్థాయి వరకు కొందరు సెటిల్ మెంట్లు చేశారని తెలుస్తోంది. నేతల కనునస్నల్లోనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు గుర్తించారు. ఈ కేసులో పలువురు నేతలకు నోటీసులు ఇచ్చి విచారించే ఛాన్స్ ఉంది.

రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు నలుగురు ఉన్నతాధికారులను అరెస్ట్ చేశారు. ప్రణీత్ రావు ఇచ్చి స్టేట్ మెంట్ ఆధారంగా అడిషనల్ ఎస్పీగా ఉన్న భుజంగరావు, తిరుపతన్నను అరెస్ట్ చేశారు. వారు ఇచ్చి స్టేట్ మెంట్ ఆధారంగా మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ ను కూడా అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు. రాధాకిషన్ ను ఏడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగానే ఈరోజు రాధాకిషన్ ను 5వ రోజు పోలీసు కస్టడీలోకి తీసుకుని విచారించారు. పోలీసుల విచారణలో అనేక సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కూడా కొన్ని ప్రత్యేకమైన సెంటర్లని మానిటరింగ్ చేసే సెంటర్లను ఏర్పాటు చేసినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. నల్గొండ, సిరిసిల్ల, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ లో ప్రత్యేక మానిటరింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఆపరేటింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఖమ్మంలో రెండు చోట్ల, వరంగల్ లో రెండు చోట్ల, మహబూబ్ నగర్ లో రెండు చోట్ల, హైదరాబాద్ ఎస్ఐబీ ప్రధాన కార్యాలయంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ నివాసం ఉండే చోట.. జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతంలో ఒక మానిటరింగ్ సెల్ ను ఏర్పాటు చేసుకుని ఫోన్ ట్యాపింగ్ చేసినట్లుగా అధికారులు ఆధారాలు సేకరించారు.

Also Read : మళ్లీ టీఆర్ఎస్‎గా బీఆర్ఎస్.. పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు కేసీఆర్ నిర్ణయం?