డ్రంక్ అండ్ డ్రైవ్ : 9 కార్లు సీజ్

హైదరాబాద్ లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు.

  • Published By: veegamteam ,Published On : February 23, 2019 / 02:26 AM IST
డ్రంక్ అండ్ డ్రైవ్ : 9 కార్లు సీజ్

Updated On : February 23, 2019 / 2:26 AM IST

హైదరాబాద్ లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు.

హైదరాబాద్ : నగరంలో తరుచుగా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్‌ తనిఖీలు చేపడుతున్నారు. పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడపవద్దని హెచ్చరిస్తున్నారు. అయినా మందుబాబుల తీరు మాత్రం మారడం లేదు. మద్యం సేవించి వాహనాలు నడుపుతూనే ఉన్నారు. పోలీసులు ఎన్నిసార్లు తనిఖీలు చేపట్టినా, కేసులు నమోదు చేసినా, వాహనాలను సీజ్ చేస్తున్నా గానీ మద్యంసేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడుతూనే ఉన్నారు.

తాజాగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మొత్తం 9మంది మందుబాబులపై కేసు నమోదు చేశారు. 9 కార్లను సీజ్ చేశారు. జూబ్లీహిల్స్‌లోని రోడ్ నెంబర్ 45లో మద్యంమత్తులో డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన ఓ యువకుడు పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. 
డ్రంక్ అండ్ డ్రైవ్ లో వచ్చే రీడింగ్, శాతాన్ని బట్టి కేసులను కోర్టులో ప్రవేశపెడతామని, చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారి తెలిపారు.