డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీలు : 12 వాహనాలు సీజ్

  • Published By: veegamteam ,Published On : March 9, 2019 / 02:19 AM IST
డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీలు : 12 వాహనాలు సీజ్

హైదరాబాద్‌ : పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా మద్యం సేవించి వాహనాలు నడపడం మాత్రం మానడం లేదు. నగరంలోని పలుచోట్ల పోలీసులు డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌  45లో చేపట్టిన తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న మందుబాబులు పట్టుబడ్డారు. పోలీసులు 12 కేసులు నమోదు చేశారు. 9 బైక్‌లు, 3 కార్లు స్వాధీనం చేసుకున్నారు. డ్రంకన్‌ డ్రైవ్‌ తనిఖీల సందర్భంగా పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.