షాకింగ్ : హీరో రాజశేఖర్ కారులో మద్యం సీసాలు.. ప్రమాదానికి కారణం అదేనా

టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆయన తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై యాక్సిడెంట్ జరిగింది.

  • Published By: veegamteam ,Published On : November 13, 2019 / 04:58 AM IST
షాకింగ్ : హీరో రాజశేఖర్ కారులో మద్యం సీసాలు.. ప్రమాదానికి కారణం అదేనా

Updated On : November 13, 2019 / 4:58 AM IST

టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆయన తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై యాక్సిడెంట్ జరిగింది.

టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ కారు(TS 07 FZ 1234) ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆయన తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై యాక్సిడెంట్ జరిగింది. విజ‌య‌వాడ‌ నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ దగ్గర మంగళవారం(నవంబర్ 12,2019) అర్ధరాత్రి ఈ యాక్సిడెంట్ జరిగింది. టైరు పగిలి డివైడర్‌ను ఢీకొని కారు మూడు ప‌ల్టీలు కొట్టిన‌ట్టు తెలుస్తోంది.

ఈ యాక్సిడెంట్ లో రాజశేఖర్ కారు నుజ్జునుజ్జు అయ్యింది. గుర్తు పట్టలేని విధంగా తయారైంది. ఈ కారుని పోలీసులు సీజ్ చేశారు. కాగా కారులో మద్యం సీసాలు లభించడం కలకలం రేపుతోంది. అంతేకాదు ప్రమాద సమయంలో కారు వేగం 150 కిమీ ఉందని గుర్తించారు. మద్యం బాటిళ్లు లభించడం, ఓవర్ స్పీడ్ ఉండటం పలు అనుమానాలకు దారితీసింది. మద్యం మత్తులోనే కారు ప్రమాదం జరిగిందా లేక అతివేగం కారణమా అన్న కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

స‌మ‌యానికి బెలూన్స్ తెరుచుకోవ‌డంతో రాజశేఖర్ కు పెద్ద ప్ర‌మాదం త‌ప్పింద‌ని స్థానికులు అంటున్నారు. రాజ‌శేఖ‌ర్‌తో పాటు మ‌రో వ్య‌క్తి కారులో ఉన్న‌ట్టు తెలిసింది. అతడికి స్వల్ప గాయాలు అయినట్టు సమాచారం. ప్రమాదం తర్వాత రాజశేఖర్ మరో కారులో వెళ్లిపోయినట్టు పోలీసులు తెలిపారు.