Jawahar Nagar Incident: జవహర్ నగర్ మహిళ హత్య కేసు.. కూతురి గురించి సంచలన విషయాలు చెప్పిన పోలీసులు
మాంటీపై రెండు పోక్సో కేసులున్నాయి. ఈ కేసులో 50 రోజులు జైలు శిక్ష అనుభవించాడు.
Jawahar Nagar Incident: తెలంగాణలో సంచలనం రేపిన జవహర్ నగర్ మహిళ అంజు హత్య కేసు వివరాలను మాల్కాజ్ గిరి డీసీపీ శ్రీధర్ మీడియాకు తెలియజేశారు. అంజు హత్య కేసులో కూతుర్ల వ్యవహారంపై అనుమానం వచ్చిందన్నారు. అయితే, 4 నెలలుగా ఎలాంటి క్లూ లభించలేదన్నారు. చిన్న కూతురు మైనర్ బాలిక అని తెలిపారు.
”మాంటీ రాజ్ తో ప్రేమ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో తల్లి అంజుపై చిన్న కూతురు కక్ష పెంచుకుంది. తల్లి అడ్డు తొలిగించుకోవాలని నిర్ణయించింది. ప్రియుడు మాంటీతో కలిసి హత్యకు ప్లాన్ చేసింది. జాబ్ నుండి వచ్చిన తల్లిని ఇంట్లో బంధించింది. మాంటీ రాజ్ కత్తితో దాడి చేసి ఆమెను హత్య చేశాడు.
చిన్న కూతురు ఆమె ప్రియుడు కలిసి కత్తితో గొంతు కోసి అంజును హత్య చేశారు. అదే ఇంట్లో బెడ్ రూమ్ లో బెడ్ కింద అంజు మృతదేహాన్ని పూడ్చి పెట్టారు. అంజు పెద్ద కూతురికి అనుమానం రాకుండా నిందితులు రూమ్ స్ప్రే లు చల్లారు.
గతంలో అంజు చిన్న కూతురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు యువకుడు మాంటీ రాజ్ పై పోక్సో కేసు నమోదు చేశాం. మాంటీపై రెండు పోక్సో కేసులున్నాయి. ఈ కేసులో 50 రోజులు జైలు శిక్ష అనుభవించాడు. అమ్మ చిట్టీ డబ్బులు కోసం ఇద్దరూ కలిసి చిట్టీ వేసే వ్యక్తిని అడిగారు. చిట్టీ అతను పోలీస్ FIR ఉంటేనే చిట్టీ డబ్బులు ఇస్తామని చెప్పాడు. దీంతో ఆ డబ్బు కోసం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తల్లి వేరే వ్యక్తితో వెళ్ళిపోయిందని చిన్నకూతురు నమ్మించిందని తెలిసింది. అంజును 2025 మే 12న హత్య చేశారు. అక్టోబర్ లో పోలీసులకు పెద్ద కూతురు ఫిర్యాదు చేసింది. తల్లి స్కూటీని చిన్న కూతురు, బాయ్ ఫ్రెండ్ మాంటీ కలిసి అమ్మేశారు. ఆ స్కూటీని త్వరలో సీజ్ చేస్తాం. కొన్ని ఆధారాలు సేకరించాము. నిందితుడు మాంటీ కుమార్ సింగ్ అలియాస్ మాంటీ రాజ్ ను రిమాండ్ కు తరలించాము. చిన్న కూతురు మైనర్ కావడంతో జువైనల్ హోమ్ కు తరలించాము” అని డీసీపీ శ్రీధర్ తెలిపారు.
మేడ్చల్ జిల్లా కౌకూరులో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రియుడి మోజులో కన్న తల్లిని కిరాతకంగా చంపింది కుమార్తె. ఈ అమానుష ఘటన ఏడాది తర్వాత పోలీసుల విచారణలో బయటపడింది. గత ఏడాది మే నెలలో తల్లి అంజును చిన్నకూతురు ఇషిక తన ప్రియుడి సాయంతో హత్య చేసింది. ఆపై నేరం నుంచి తప్పించుకోవడానికి డెడ్ బాడీని ఇంట్లోనే పాతిపెట్టింది.
Also Read: వైరల్ గర్ల్ మోనాలిసా సంచలన ఆరోపణలు.. ‘ఆ దర్శకుడు నన్ను అసభ్యంగా తాకాడు.. కన్నవాళ్లకు చెబితే…’
