Red Sandal : కడప జిల్లాలో ఎర్రచందనం డంప్ స్వాధీనం
కడప జిల్లాలో భారీ ఎర్రచందనం డంపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒంటిమిట్ట మండలం మంటపం పల్లి పంచాయితీ పరిధిలో ఈ డంపును స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ కెకే అన్బురాజన్ ప్రకటించారు.
Red Sandalwood : కడప జిల్లాలో భారీ ఎర్రచందనం డంపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒంటిమిట్ట మండలం మంటపం పల్లి పంచాయితీ పరిధిలో ఈ డంపును స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ కెకే అన్బురాజన్ ప్రకటించారు. చెన్నైకి తరలించేందుకు సిద్దంగా ఉన్న రెండు టన్నుల బరువైన వంద ఎర్ర చందనం దుంగలను, ఒక స్కోడా కారును స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. వీరితో పాటు రైల్వే కోడూరులో ఫారెస్టు ఆఫీసులో పనిచేస్తున్న వాచ్ గార్డును కూడా అరెస్టు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ వివరించారు. ఇందులో మైలారి కిరణ్ కుమార్ రెడ్డి, మంచాన రాజశేఖర్‌లు ప్రధాన నిందుతులుగా గుర్తించామని చెప్పారు.
ఎక్కువ కేసులున్న స్మగ్లర్ల ఆస్తులను కూడా జప్తు చేస్తున్నామని….ఇప్పటి దాకా సుమారు పది కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుని అటవీ శాఖకు అటాచ్ చేశామని చెప్పారు. అక్రమ రవాణాలో పాలు పంచుకుంటున్న నలుగురిపై పీ.డీ.యాక్డు కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ వివరించారు.
Also Read : Green Cards : ఆరునెలల్లో గ్రీన్‌కార్డుల అప్లికేషన్లు క్లియర్ చేయండి