పొన్నాల కారుకు రోడ్డు ప్రమాదం

పొన్నాల కారుకు రోడ్డు ప్రమాదం

Updated On : October 29, 2019 / 1:22 AM IST

కాంగ్రెస్‌ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ అయింది. జూబ్లీహిల్స్‌లో రోడ్ నెంబర్ 45 సిగ్నల్ దగ్గర ఆగివున్న కారును సినిమా షూటింగ్ వాహనం ఢీకొట్టింది. సోమవారం రాత్రి 9.30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పొన్నాల కారు ముందు భాగం స్వల్పంగా దెబ్బతింది. 

కారుకు మాత్రమే నష్టం జరగడంతో పొన్నాలకు ఎటువంటి గాయాలు కాలేదు. ఘటనాస్థలం నుంచి కాసేపటికే ఆయన వెళ్లిపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో పొన్నాల మనవడు కూడా కారులో ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సినిమా వాహనం ఎవరిది, దాని నడుపుతున్న డ్రైవర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది. బస్సుకు సాంకేతిక లోపాలేమైనా ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు.