పోలీసు వాహానం ఢీ కొట్టిన చిన్నారి ప్రణతి మృతి

  • Published By: chvmurthy ,Published On : May 12, 2019 / 03:55 AM IST
పోలీసు వాహానం ఢీ కొట్టిన చిన్నారి ప్రణతి మృతి

Updated On : May 12, 2019 / 3:55 AM IST

హైదరాబాద్: నాలుగు రోజుల క్రితం యాదాద్రిలో రాచకొండ పోలీస్‌ వాహనం ఢీ కొట్టిన ఘటనలో గాయపడిన చిన్నారి ప్రణతి (3) ఆదివారం ఉదయం మృతి చెందింది. యాదగిరి గుట్ట  పాత లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం వద్ద  పోలీసు వాహనం ఢీ కొట్టటంతో తీవ్ర గాయాల పాలైన ప్రణతిని హైదరాబాద్ కామినేని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. నాలుగు రోజులుగా చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుఝూమున ప్రణతి మృతి చెందింది. చిన్నారికి గుండె పనిచేయక పోవడంతో మృత్యువుతో పోరాడి చివరకు తుది శ్వాస విడిచిందని డాక్టర్లు తెలిపారు.  కాగా నిర్లక్ష్యంగా వాహనం నడిపిన డ్రయివర్ ను  రాచకొండ పోలీసులు అరెస్టు చేసారు.