ప్రణయ్ కేసు : ఫిబ్రవరి 24న చార్జ్ షీట్ 

  • Published By: veegamteam ,Published On : January 30, 2019 / 05:12 AM IST
ప్రణయ్ కేసు : ఫిబ్రవరి 24న చార్జ్ షీట్ 

Updated On : January 30, 2019 / 5:12 AM IST

హైదరాబాద్ : రాష్ట్రంలో సంచనలం రేపిన అమృత..భర్త ప్రణయ్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. హత్యకు సంబంధించి 2019, ఫిబ్రవరి 24న ఫైనల్ ఛార్జిషీట్ దాఖలు చేయనున్నారు పోలీసులు. హత్య జరిగిన నాలుగు రోజులకు నల్గొండ పోలీసులు ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. అమృత తండ్రి మారుతీ రావు ప్రధాన నిందితుడు. శ్రావణ్, అగర్గర్ అలీ, మొహమ్మద్ బారి, అబ్దుల్ కరీం, శివ. సుభాష్ శర్మలను నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే.

 

ఫిబ్రవరి మొదటి వారంలో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి వివరాలు వస్తాయని.. ఆ నివేదిక ఆధారంగా చార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు వెల్లడించారు పోలీసులు. పలుమార్లు బెయిల్ పిటీషన్ దాఖలు చేసినా కోర్టు నిరాకరించింది. పలుకుబడిన వ్యక్తులు కావటం, కేసు తీవ్రత దృష్ట్యా బెయిల్ కు నిరాకరించింది కోర్టు. నిందితులు నేరం చేశారని బలమైన ఆధారాలను కోర్టు ఎదుట పోలీసులు పెట్టారు. దీంతో కూడా బెయిల్ దొరకలేదని చెబుతున్నారు. బెయిల్ రాకుండా తగిన ఆధారాలతోనే ఛార్జిషీట్ దాఖలు చేయనున్నారు. రిటైర్డ్ హైకోర్టు జడ్జి నేతృత్వంలోని ఎడ్వయిజరీ బోర్డు, పోలీస్ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ ను కూడా కోర్టు ప్రస్తావించింది.

 

వీటన్నింటి దృష్ట్యా పక్కా ఆధారాలతో, నిందితులకు కఠిన శిక్షలు పడే విధంగా ఛార్జిషీటు దాఖలు చేయనున్నట్లు నల్గొండ పోలీసులు చెబుతున్నారు. ఇంకా సమయం ఉందని అంటున్నారు. కేసులోని అన్ని కోణాలు, అన్ని అంశాలపై లోతైన విచారణతోనే తుది ఛార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు చెబుతున్నారు.