Karnataka : ప్రభుత్వ అధికారిణి దారుణ హత్య.. భర్త ఇంట్లో లేని సమయంలో ..
కర్నాటకలో ప్రభుత్వ అధికారిణి ప్రతిమ దారుణ హత్య సంచలనం రేపింది. ఇంట్లో ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

Karnataka
Karnataka : కర్నాటకలో ప్రభుత్వ అధికారిణి దారుణ హత్య సంచలనం కలిగించింది. మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్ మెంట్‌లో డిప్యూటీ డైరెక్టర్‌గా ఉన్న ప్రతిమ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది.
కర్నాటకలోని సుబ్రహ్మణ్యపోరాలో నివాసం ఉంటున్న ప్రభుత్వ అధికారిణి ప్రతిమ (37) దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను కత్తితో పొడిచి హత్య చేసినట్లు తెలుస్తోంది. ప్రతిమ మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్‌మెంట్‌లో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. భర్త తన స్వస్థలం తీర్థహళ్లికి వెళ్లడంతో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్నట్లు తెలుస్తోంది.
PM Modi : ఉచిత రేషన్ పథకం మరో 5 ఏళ్లు పొడిగింపు.. ఛత్తీస్‌గఢ్ ర్యాలీలో ప్రకటించిన మోదీ
ప్రతిమకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో సోదరుడు ఇంటికి వెళ్లి చూడగా ఆమె శవమై కనిపించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Karnataka