PM Modi : ఉచిత రేషన్ పథకం మరో 5 ఏళ్లు పొడిగింపు.. ఛత్తీస్‌గఢ్ ర్యాలీలో ప్రకటించిన మోదీ

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉచిత రేషన్ పథకాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.

PM Modi : ఉచిత రేషన్ పథకం మరో 5 ఏళ్లు పొడిగింపు.. ఛత్తీస్‌గఢ్ ర్యాలీలో ప్రకటించిన మోదీ

PM Modi

Updated On : November 5, 2023 / 1:12 PM IST

PM Modi : పేదల ఉచిత రేషన్ పథకాన్ని వచ్చే ఐదేళ్లపాటు పొడిగించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని ప్రకటించారు. దీంతో 81.35 కోట్ల మంది ప్రజలు NFSA క్రింద ఉచిత రేషన్ అందుకోనున్నారు.

PM Modi : నవంబర్ 7న తెలంగాణకు మోదీ.. ప్రధాని అధికారిక షెడ్యూల్ ఇదే

80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ పథకాన్ని మరో ఐదేళ్ల పాటు పొడిగించాలని బీజేపి నేతృత్వంలోని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ర్యాలీలో ఈ విషయాన్ని మోదీ ప్రకటించారు. ఈ పథకం కోసం దాదాపు రూ. 2 లక్షల వ్యయం అవుతుంది. త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మోదీ ఈ ప్రకటన చేశారు. చత్తీస్త్‌గఢ్‌లోని దుర్గ్, మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో జరిగిన ప్రచార సభలో మోదీ మాట్లాడారు.

Assembly Elections 2023: గెలుపు గురించి ఎవరూ మాట్లాడరట.. ప్రధాని మోదీ ఎందుకిలా అన్నారు?

ప్రస్తుతం NFSA చట్టం ప్రకారం లబ్ధిదారులు కిలో బియ్యంకి నామ మాత్రంగా రూ. 1-3 రుసుము చెల్లిస్తున్నారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం 2020 కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రవేశపెట్టారు. దీని క్రింద ప్రభుత్వం NFSA కోటాలో ఉన్న వ్యక్తులకు 5 కిలోల బియ్యాన్ని పూర్తి ఉచితంగా సరఫరా చేసింది. ప్రస్తుతం కేంద్రం PMGKAY పథకాన్ని NFSAతో విలీనం చేసింది. తాజాగా ఆహార మంత్రి పీయూష్ గోయల్ PMGKAY పథకం క్రింద రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 1,118 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను ప్రభుత్వం కేటాయించినట్లు పార్లమెంటులో వెల్లడించారు.