తృటిలో తప్పిన ప్రమాదం : లోయలోకి దూసుకెళ్లిన బస్సు

కర్నూలు: ఘోర ప్రమాదం తప్పింది. ప్రయాణికులంతా సేఫ్ గా బయటపడ్డారు. శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రైవేట్ టూరిస్ట్ బస్సుకి ప్రమాదం తప్పింది. చిన్నారుట్ల వద్ద అదుపుతప్పిన బస్సులో లోయలోకి దూసుకెళ్లింది. అయితే ఎలాంటి ఘోరం జరగలేదు. బస్సులో 50మంది ప్రయాణికులు ఉన్నారు. వారంతా సేఫ్ గా బయటపడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
మహారాష్ట్ర నుంచి శ్రీశైలం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. 2019, జనవరి 13వ తేదీ ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ డివైడర్‌ను ఢీ కొనడంతో అదుపుతప్పిన బస్సు లోయలోకి దూసుకెళ్లింది. ఎదురుగా చెట్టును ఢీకొని డివైడర్‌పై బస్సు వెనుకభాగం నిలిచిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు స్పాట్‌కి చేరుకుని ప్రయాణీకులను సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనలో ముగ్గురికి స్వల్పంగా గాయాలయ్యాయి.