13 రోజుల పసిగుడ్డు గొంతు కోసి చంపి అడవిలో పాతిపెట్టిన తల్లిదండ్రులు..

Pune couple : కన్న తల్లిదండ్రులకే పసిగుడ్డు పాలిట మృత్యువులయ్యారు. 13 రోజుల పసిబిడ్డు చంపి పూడ్చిపెట్టిన ఘటన పూణెలో చోటుచేసుకుంది. పుట్టిన బిడ్డను చేతులారా చంపేసి పూణేలోని వాడ్గోన్ సిన్గాడ్ కాలేజీ హాస్టల్ వెనుక ఉన్న అటవీప్రాంతంలో పాతిపెట్టారు. తరువాత బిడ్డ చనిపోయిందని ఖననంచేసేసామని నమ్మించారు. కానీ ఇదికాస్తా పోలీసులకు తెలియటంతో అసలు విషయం బైటపడింది.
వివరాల్లోకి వెళితే..తుకైనగర్ కు చెందిన 34ఏళ్ల కున్వర్శింగ్ ఠాకూర్ అతని భార్య 21 ఏళ్ల సిద్ది ఠాకూర్ లకు ఓ బిడ్డ పుట్టింది. ఆ బిడ్డ బలహీనంగా (డౌన్స్ సిండ్రోమ్) పుట్టింది. దీంతో వారు బిడ్డకు చికిత్స చేయించాలని హాస్పిటల్ కు తీసుకెళ్లగా ఇది నయంకాదని డాక్టర్లు చెప్పారు.
దీంతో జీవితాంతం ఆ బిడ్డను భరించలేమని భార్యాభర్తలిద్దరూ సోమవారం (అక్టోబర్ 12,2020) కలిసి ఆ 13 రోజుల పసిగుడ్డు గొంతు కోసి.. చంపేశారు. ఆ తరువాత వాడ్గోన్ సిన్గాడ్ కాలేజీ హాస్టల్ వెనుక ఉన్న అడవి ప్రాంతంలో పాతిపెట్టి వచ్చేశారు. ఆ తరువాత బిడ్డ చనిపోయిందనీ..ఖననం చేసేశామని నమ్మించారు.
కానీ మంగళవారం సాయంత్రం సింహాగడ్ పోలీసులకు అటవీప్రాంతంలో బిడ్డను పాతిపట్టినట్లుగా సమాచారం రావటంతో హుటిహుటిన ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
తరువాత స్థానికి తహశీల్దార్ అనుమతి తీసుకుని ఆ ప్రాంతాన్ని తవ్వి చూడగా బిడ్డ మృతదేహం కనిపించింది. దాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. తరువాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టగా సదరు తల్లిదండ్రుల గురించి తెలిసింది.
ఈ ఘటనపై సింహాగడ్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నందకిషోర్ షెల్కే మాట్లాడుతూ..డౌన్స్ సిండ్రోమ్ తో పుట్టిన శిశువుకు వైద్యం చేయించలేక ఆ బిడ్డను సాకలేని ఆర్థిక పరిస్థితుల్లో ఉన్న కున్వర్శింగ్ ఠాకూర్ దంపతులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని తెలిపారు.
కున్వర్శింగ్ ఓ బట్టల షాపులో పనిచేస్తుంటాడనీ..లాక్ డౌన్ తో అన్ని మూసేయటంతో ఉన్న ఉపాధి కూడా కోల్పోయిన కష్టాల్లో అనారోగ్య సమస్యలతో పుట్టిన బిడ్డను సాకలేక ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా తమ దర్యాప్తులో తేలిందని తెలిపారు. కష్టంలో ఉన్నాగానీ వారు చేసింది నేరమేనని వారిని అరెస్ట్ చేశామని తెలిపారు.