#JusticeForMadhu : కర్ణాటకలో విద్యార్థిని హత్య..తీవ్రమౌతున్నఆందోళనలు

కర్ణాటకలో కలకలం రేగుతోంది. విద్యార్థిని మృతి కేసు అక్కడ సంచలనంగా మారింది. రాయచూర్ ఏరియాలో వెలుగు చూసిన అత్యంత దారుణ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అదృశ్యమైన 3 రోజుల అనంతరం విగతజీవిగా దర్శనమిచ్చింది. సగం కాలిన దేహంతో..చెట్టుకు ఉరివేసుకుని కనిపించింది. ఈ ఘటనపై ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి.
పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే తమ బిడ్డ బతికేదని తల్లిదండ్రులు రోదిస్తున్నారు. సోషల్ మీడియాలో విద్యార్థిని హత్య వైరల్ అయ్యింది. ఈ ఆందోళనతో మేల్కొన్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి నిందితుడు సుదర్శన్ యాదవ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Also Read : టీవీ నటి కూడా : మద్యం తాగి స్టేడియంలో యువతుల వీరంగం
ఇంటర్నల్ పరీక్షలకు హాజరయ్యేందుకు ఏప్రిల్ 13వ తేదీన విద్యార్థిని మధు బయటకు వెళ్లింది. సాయంత్రం తిరిగి రాలేదు. వెంటనే పేరెంట్స్ చుట్టుపక్కలా వెతికారు. తెలిసిన వారిని అడిగారు. ఎలాంటి సమాచారం తెలియకపోవడంతో పేరెంట్స్ మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అక్కడ సిబ్బంది ఫిర్యాదును స్వీకరించలేదని..కాలయాపన చేశారంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
ఏప్రిల్ 15వ తేదీన నిర్మానుష్య ప్రాంతంలో చెట్టుకు శవమై మధు కనిపించింది. శరీరం సగం కాలిపోయి ఉంది. అన్ని సబ్జెక్టులు ఫెయిలైన కారణంగా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఘటనాస్థలంలో దొరికిన లెటర్‌పై తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. లేఖ కన్నడ భాషలో ఉందని..ఆ భాషే తమ బిడ్డకు రాదని చెబుతున్నారు. అన్ని సబ్జెక్టుల్లో పాస్ అయితే ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుందని ప్రశ్నిస్తున్నారు.
Also Read : తగ్గని ఇంటర్ మంటలు : అన్నింట్లో 80.. లెక్కల్లో మాత్రమే 5 మార్కులు
దారుణంగా హత్య చేసినా పోలీసులు స్పందించకపోవడంపై అక్కడి విద్యార్థి సంఘాలు, మహిళా సంఘాలు స్పందించాయి. సినీ స్టార్స్ సైతం దీనిపై స్పందించారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని సామాజిక మాధ్యమాల్లో డిమాండ్స్ వినిపించాయి. #JusticeForMadhu హ్యాష్ ట్యాగ్‌తో పోస్టులు పెడుతున్నారు. బయటకు వచ్చి ర్యాలీలు, ప్రదర్శనలు చేస్తున్నారు. కొవ్వొత్తులు వెలిగిస్తూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్స్ చేస్తున్నారు. ఒత్తిడిని గమనించిన సీఎం కేసును సీఐడీకి అప్పగించారు. ప్రస్తుతం సీఐడీ బృందం విచారిస్తోంది.