దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా రాష్ట్రాల్లో తగ్గిన నేరాలు

  • Published By: veegamteam ,Published On : April 1, 2020 / 10:19 AM IST
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా రాష్ట్రాల్లో తగ్గిన నేరాలు

Updated On : April 1, 2020 / 10:19 AM IST

కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది ప్రభుత్వం. దాంతో అందరు ఇళ్లకు పరిమితమయ్యారు. ఈ లాక్ డౌన్ కారణంగా నేరస్ధులు దొంగతనాలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రాష్ట్రాల్లో దొంగతనాలు, రోడ్దు ప్రమాదాల వల్ల మరణించే వారి సంఖ్య గణనీయంగా తగ్గినట్లు తెలుస్తుంది. గత రెండు వారాలుగా లాక్ డౌన్ కారణంగా క్రైమ్ రేటు తగ్గుతూ వస్తుంది. 

లాక్ డౌన్ కారణంగా చాలామంది ఇండ్లలో ఉండటం వల్ల దొంగతనాలు, దోపిడిలు చేయటానికి వీలుగా లేకపోవటం. వీధుల్లో పోలీసు బలగాలు మోహరించి ఉండటం వల్ల నేరస్ధులు తప్పించుకుని పోవటానికి అంత సులభంగా కాదు. దొంగతనం చేసిన వస్తువులను అమ్మటానికి మార్కెట్లు తెరచిలేకపోవటం వంటి వాటి వల్ల క్రైమ్స్ జరగటం లేదని పోలీసులు చెబుతున్నారు. దీంతో పాటు బార్లు, వైన్ షాపులు మూసివేయటం కూడా సహాయ పడిందంటూ పోలీసులు అంటున్నారు.

గతేడాది మార్చితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో బెంగుళూరులో క్రైమ్ రేటు తక్కువగా నమోదయ్యింది. ఉదాహరణకు గొలుసు స్నాచింగ్ విషయానికి వస్తే మార్చి నెలల్లో కనిష్టంగా 5 కేసులు నమోదయ్యాయి. వెహికల్ దొంగతనాల సంఖ్య కూడా గతేడాది మార్చి నెలతో 432 కేసులు నమోద్యతే ఈ నెలల్లో మాత్రం 249 గా నమోదయ్యినట్లు నివేదికలు వెల్లడించాయి. రోడ్డు ప్రమాదాల వల్ల మరణించే వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది.   

ఒడిశా ప్రాంతంలో కూడా గత రెండు వారాలుగా అత్యాచారాలు, దొంగతనాలు, దోపిడీలు వంటి నేరాల సంఖ్య తగ్గినట్లు తెలుస్తుంది. అంతకుముందు రాష్ట్రంలో ఒక రోజులో దాదాపుగా 332 కేసులు నమోదయ్యేయి. ప్రస్తుతం వీటి సంఖ్య 150 కి పడిపోయింది. అంతేకాకుండా గత కొద్ది రోజులుగా భువనేశ్వర్, పూణే, భోపాల్ వంటి పాంత్రాల్లో నేరాలు సంఖ్య తగ్గినట్లు నివేదికలు తెలిపాయి. హైదరాబాద్ రాష్ట్రంలో కూడా నేరాల సంఖ్య తగిన పరిస్ధితులు కనిపిస్తున్నాయి అని కొన్ని నివేదికలు వెల్లడించాయి.