Road Accident : అరకు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
నందివలస గ్రామంలో శుక్రవారం రాత్రి జాతర జరిగింది. ఆ జాతరకు వెళ్లి వస్తుండగా రాత్రి 11గంటల సమయంలో రెండు బైకులను అరకులోయ నుంచి వెళ్తున్న..

Araku Valley Accident
Araku Valley Accident : అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా.. పలువురికి గాయాలయ్యాయి. అరకు లోయ మండలం నందివలసలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పి మూడు బైక్ లు ఢీకున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా.. మరికొందరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను అరకు లోయ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు. చికిత్స పొందుతూ మరో వ్యక్తి మరణించాడు.
Also Read : Fire Accident : రెస్టారెంట్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 44 మంది మృతి
నందివలస గ్రామంలో శుక్రవారం రాత్రి జాతర జరిగింది. ఆ జాతరకు వెళ్లి వస్తుండగా రాత్రి 11గంటల సమయంలో రెండు బైకులను అరకులోయ నుంచి వెళ్తున్న బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మృతులు చినలబుడు ప్రాంతానికి చెందిన బురిడీ హరి (17), గొల్లూరి అమ్మనాకాంత్ (13), లోతేరు ప్రాంతానికి చెందిన త్రినాథ్ (32), భార్గవ్ (4) ఉన్నారు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువుల రోధనలతో ఆస్పత్రి ప్రాంతంలో విషాదం నెలకొంది.