నూకలు రాసిపెట్టి ఉన్నాయ్..వెంట్రుక వాసిలో బతికిపోయారు

  • Published By: chvmurthy ,Published On : February 17, 2020 / 04:03 AM IST
నూకలు రాసిపెట్టి ఉన్నాయ్..వెంట్రుక వాసిలో బతికిపోయారు

Updated On : February 17, 2020 / 4:03 AM IST

కదులుతున్న రైలు లోకి ఎక్కరాదు…. 
కదులుతున్న రైలు లోంచి దిగరాదు….
రైల్వే స్టేషన్ లోని రైలు పట్టాలను దాటరాదు …చట్టరీత్యానేరం..

ఇవి  సాధారణంగా ప్రతి రైల్వే స్టేషన్లోనూ కనిపించే హెచ్చరికల బోర్డులు. కానీ ప్రజలెవ్వరూ వీటిని పెద్దగా పట్టించుకోరు.  ప్రయాణ సమయానికి ముందు రాకుండా… రైలు స్టార్టవ్వగానే పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కటం..  ఫలానా ప్లాట్ ఫాం నెంబరు మీదుకు రైలు వస్తోందని ఎనౌన్స్ మెంట్ వినగానే మెట్లెక్కో, ఎస్కలేటర్ ఎక్కి సంబంధిత ప్లాట్ ఫారం పైకి  చేరుకుండా అడ్డదారిలో పట్టాలకు అడ్డంపడి… వెళ్లాల్సిన ప్లాట్ ఫారం పైకి చేరుతుంటారు.  

ఇలాంటి సాహాసాలు చేసే చాలా మంది ప్రాణాలు పోగోట్టుకున్నసందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ ఇలాంటి పరిస్ధితుల్లో కొందరు సమయ స్పూర్తితో వ్యవహరించటంతో ఇటీవల ఇద్దరు ప్రాణాలు దక్కించుకున్నారు. వీటికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాకపోతే రెండు సంఘటనలు ఒకే రోజు  ఫిబ్రవరి 15న జరగటం గమనార్హం.
 

కదులుతున్నరైలులో ఎక్కి అపాయంలో చిక్కుకున్న ప్రయాణికురాలిని ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఒడిషాలో రక్షిస్తే….. కూతవేటు దూరంలో రైలు ఉండగా  పట్టాలు  దాటుతున్న వ్యక్తిని తోటి ప్రయాణికులు కాపాడిన ఘటన  ముంబై లోని బైసుల్లాలో జరిగింది. 

ఒడిషాలో కదులుతున్నరైలు ఎక్కబోయి పడిపోయిన ప్రయాణికురాలు
కదులుతున్న రైలు ఎక్కబోయి ప్రమాదంలో పడిన మహిళా ప్రయాణికురాలిని ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ కాపాడిన ఘటన శనివారం  ఫిబ్రవరి15న ఒడిశాలో జరిగింది.   భువనేశ్వర్‌ రైల్వే స్టేషన్‌లో ఓ మహిళా ప్రయాణికురాలు కదులుతున్న రైలు ఎక్కబోయింది. అప్పటికే  ప్రయాణికులతో నిండుగా ఉన్నరైలు ఎక్కడం ఆమెకు వీలుకాకపోగా రైలుకు, ప్లాట్‌ఫామ్‌కు మధ్యలో ఉన్న గ్యాప్‌లో ఆమె పడబోయింది. ఇది గమనించిన ఓ ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ వెంటనే పరిగెత్తుకొచ్చి ఆమెను బయటకు పట్టుకుని బయటకు లాగాడు. దీంతో పెద్ద ప్రమాదమే తప్పిందని అక్కడి జనాలు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ వీడియో  సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా…  ప్రయాణికురాలు చేసిన పనిని నెటిజన్లు తప్పుపుడుతున్నారు. ‘కొంచెం కూడా చూసుకోనక్కర్లేదా.. అక్కడ ఎవరూ లేకపోయుంటే ఆమె పరిస్థితి ఏమయ్యేదో ఊహించడానికే భయంకరంగా ఉంది’ అంటూ చివాట్లుపెడుతున్నారు. మరోవైపు కానిస్టేబుల్‌ చూపిన చొరవకు జేజేలు పలుకుతున్నారు. ‘మహిళ ప్రాణాలను కాపాడిన రియల్‌ హీరో’ అంటూ ఆకాశానికి ఎత్తుతున్నారు. 

ముంబై బైసుల్లా రైల్లే స్టేషన్లో పట్టాలు దాటిన వ్యక్తి
ఇక … ముంబైలోని బైసుల్లా రైల్వే స్టేషన్‌లోనూ  దాదాపు ఇలాంటి ఘటనే ఫిబ్రవరి 15 శనివారం నాడు జరిగింది. ఓ వ్యక్తి రైల్వే ట్రాక్‌ను దాటడానికి ప్రయత్నిస్తుండగా అదే సమయంలో ఆ ట్రాక్ మీదుగా ఉన్న ప్లాట్ ఫారం కు రైలు వస్తోంది. ఆ వ్యక్తి రైలు పట్టాలకు అడ్డంగా పరిగెత్తుకు వచ్చి ప్లాట్ ఫారం ఎక్కబోయాడు. కొద్ది  దూరంలో రైలు …. ఇది గమనించిన లోకో పైలట్ రైలును కొంచెం దూరంలోనే ఆపేశాడు. ప్లాట్ ఫారం మీద నుంచి ఇది గమనించిన తోటి ప్రయాణికులు కొందరు ఆ వ్యక్తిని ప్లాట్‌ఫామ్‌ మీదకు లాగారు.  ఇక ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ సదరు వ్యక్తి భాద్యతారాహిత్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ రెండు ఘటనలు ఫిబ్రవరి 15నే జరగడం గమనార్హం