ఇంటికెళ్లడానికి రైలు ఎక్కిస్తానంటూ తీసుకెళ్లి మైనర్ బాలికపై రేప్.. RPSF కానిస్టేబుళ్లు అరెస్టు

ఢిల్లీ పోలీసులు మైనర్ బాలికపై రేప్ కేసులో ఇద్దరు RPSF కానిస్టేబుళ్లను అరెస్టు చేశారు. న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అధికారులు చెబుతున్నారు. జూన్ 12న ఈ ఘటన జరిగింది. ఈస్ట్ ఢిల్లీలో ఇంటి పనులు చేసుకునే బాలిక ఝర్ఖాండ్ లోని సొంతూరుకి వెళ్లేందుకు ట్రైన్ ఎక్కేందుకు రైల్వే స్టేషన్ కు వచ్చింది.
జార్ఖండ్ వెళ్లేందుకు బాలిక టైన్ల కోసం ఎంక్వైరీ చేస్తుంది. ఈ లోపే రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (RPSF) కానిస్టేబుల్ ఆమెను సమీపించాడు. ‘తనతో వస్తే అదే ట్రైన్ ఎక్కిస్తానని ఆమెకు అబద్ధం చెప్పాడు. దానికి బాలిక ఒప్పుకుని బైక్ మీద కూర్చొంది. ఆ తర్వాత కొలీగ్ కు ఫోన్ చేశాడు. బాలికతో బలవంతంగా లిక్కర్ తాగించాడు. ఇద్దరూ కలిపి ఓ గ్రౌండ్ కు తీసుకెళ్లి రేప్ చేశారు’ అని పోలీస్ అధికారి వెల్లడించారు.
బాలికను ఓల్డ్ రైల్వే స్టేషన్ బయట విడిచి వెళ్లడంతో అక్కడే పడిపోయింది. మోనికా భరద్వాజ్(డీసీపీ) తమ కానిస్టేబుల్ ఒకరు స్టేషన్ కు దగ్గరే ఉండటంతో ఇది గమనించారని తెలిపారు.
‘ఘటన గురించి బాధితురాలు వారికి చెప్పింది. బాలిక పోలీస్ స్టేషన్ కు వచ్చి ఇద్దరిపైన ఫిర్యాదు చేసింది. గ్యాంగ్ రేప్ నేరం కింద పలు సెక్షన్లపై వారి కేసు ఫైల్ చేశారు. స్పాట్ నుంచి సీసీటీవీ ఫుటేజి రికవరీ చేసుకుని.. నిందితులైన కానిస్టేబుళ్లపై విచారణ జరుపుతున్నారు.
Read: భోజనం దగ్గర గొడవ…వధువు తమ్ముడిని హత్య చేసిన వరుడు