కరెంట్ షాక్ : ఆర్మీ సెలక్షన్‌లో విషాదం

  • Published By: madhu ,Published On : January 28, 2019 / 04:45 AM IST
కరెంట్ షాక్ : ఆర్మీ సెలక్షన్‌లో విషాదం

Updated On : January 28, 2019 / 4:45 AM IST

హైదరాబాద్ : అధికారుల నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం గాలిలో కలిసిపోయింది. మౌలాలీ ఆర్పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఆర్మీ సెలక్షన్స్ కోసం వచ్చిన యువకుడు అనంతలోకాలకు వెళ్లిపోయాడు. అధికారలు సరిగ్గా ఏర్పాట్లు చేయకపోవడంతోనే ఇది చోటు చేసుకుందని సెలక్షన్స్‌కు వచ్చిన వారు ఆరోపిస్తున్నారు. 
జనవరి 28వ తేదీ సోమవారం ఆర్పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్‌లో సెలక్షన్స్ జరుగుతున్నాయి. జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడకు వచ్చారు. వనపర్తి జిల్లాకు చెందిన అరవింద్…కూడా వచ్చాడు.

అయితే హైటెన్షన్ వైర్లు కిందకు వేలాడుతున్నాయి. కాలు తగలడం…వెంటనే అక్కడికక్కనే అరవింద్ కుప్పకూలిపోయాడు. దీనిపై సెలక్షన్స్‌కు వచ్చిన వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస సౌకర్యాలు కల్పించలేదని మండిపడుతున్నారు. అధికారులు కనీసం రెస్పాండ్ కూడా కావడం లేదని ఆరోపిస్తున్నారు. ఘటనాస్థలికి పోలీసులు చేరుకుని అరవింద్ డెడ్ బాడీని గాంధీ మార్చురీకి తరలించారు.