Post Mortem Report : సైదాబాద్ నిందితుడు రాజు పోస్ట్‌మార్టం నివేదికలో ఏముంది ?

సైదాబాద్ చిన్నారి హత్యాచారం కేసు నిందితుడు పల్లంకొండ రాజు పోస్ట్ మార్టం రిపోర్టు‌పై ఉత్కంఠ నెలకొంది.

Post Mortem Report : సైదాబాద్ నిందితుడు రాజు పోస్ట్‌మార్టం నివేదికలో ఏముంది ?

Wgl Mgm Hospital

Updated On : September 18, 2021 / 6:37 PM IST

Post Mortem Report :  సైదాబాద్ చిన్నారి హత్యాచారం కేసు నిందితుడు పల్లంకొండ రాజు పోస్ట్ మార్టం రిపోర్టు‌పై ఉత్కంఠ నెలకొంది. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఫోరెన్సిక్ నిపుణుడు డాక్టర్ రజమాలిక్ నేతృత్వంలోని ముగ్గురు డాక్టర్లు బృందం పోస్టుమార్టం నిర్వహించింది. నిందితుడి శరీరంపై కమిలిన గాయాలు ఉన్నాయని ఆయన చెప్పారు. కుటుంబ సభ్యుల అనుమానాలతో మాకు సంబంధం లేదని… నిందితుడి బాడీని పోస్టుమార్టం చేసి నిష్పక్షపాత నివేదిక అందించటం వరకే మా పాత్ర అని ఆయన చెప్పారు.

హత్య చేసారా.. రైలు పట్టాలపై నెట్టేసారా…. అతనే పడ్డాడా అనేది చెప్పడం కష్టం అని వివరించారు. మృతుడు మత్తు మందు సేవించాడాలేదా అనేది పరీక్షించటానికి ఎఫ్ఎస్ ఎల్ కు రిపోర్టు పంపించామని ఆయన తెలిపారు. నిందితుడి మృతదేహం ముఖం, తల, చేయి చిట్లిపోయి ఉన్నాయని…విషప్రయోగం జరిగిందా అనే కోణంలో కూడా పోస్టుమార్టంలో ద్రుష్టి పెట్టామని డాక్టర్ రజమాలిక్ చెప్పారు.

రైలు వేగం.. బాడీ పడి ఉన్న తీరును చెప్పాలంటే సీన్ జరిగిన ప్రదేశానికి వెళ్లాల్సిందే అని ఆయన వివరించారు. శరీరంపై ఉన్న గాయాల మేరకే ప్రాథమిక నిర్ధారణకు వచ్చామని డాక్టర్ తెలిపారు. నిందితుడి పొట్ట ఖాళీగా ఉందని… ఎలాంటి ఆహార పదార్ధాలు లేవని… కేవలం 50ML మిశ్రమం మాత్రమే ఉందని ఆయన తెలిపారు. మృతుడు ఆల్కహాల్ తీసుకున్నట్లు పోస్టుమార్టంలో కనిపించలేదని… శరీరంపై ఆయిల్ గ్రీజ్ నరకలున్నాయని డాక్టర్ రజమాలిక్ వివరించారు.