Raju Suicide : పోలీసులే పరిగెత్తించి చంపేశారు.. రాజు తల్లి సంచలన ఆరోపణలు

హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై హత్యాచారం కేసులో నిందితుడు రాజు అనూహ్యంగా రైలు పట్టాలపై శవమై తేలాడు. ఘట్‌కేసర్-వరంగల్ మధ్య స్టేషన్ ఘన్‌పూర్ మండలం పామునూరు ద

Raju Suicide : పోలీసులే పరిగెత్తించి చంపేశారు.. రాజు తల్లి సంచలన ఆరోపణలు

Raju Suicide Ok

Raju Suicide : హైదరాబాద్‌లోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై హత్యాచారం కేసులో నిందితుడు రాజు అనూహ్యంగా రైలు పట్టాలపై శవమై తేలాడు. ఘట్‌కేసర్-వరంగల్ మధ్య స్టేషన్ ఘన్‌పూర్ మండలం పామునూరు దగ్గర రేల్వే ట్రాక్‌పై రాజు విగతజీవిగా కనిపించాడు. రైల్వేట్రాక్‌పై శవాన్ని గుర్తించిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. చేతిపై మౌనిక అనే పేరుతో టాటూ గుర్తించిన పోలీసులు ఆ మృతదేహం రాజుదేనని నిర్ధారించారు. రాజు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు.

కాగా, రాజు మరణంపై తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మా కొడుకును పోలీసులే చంపి ఉంటారని రాజు తల్లి వీరమ్మ సంచలన ఆరోపణలు చేశారు. ”రాజు తప్పు చేయలేదు అనడం లేదు.. అది కూడా అనుమానమే. రాజుని కోర్టులో హాజరు పర్చాల్సింది. అసలు నా కొడుకు తప్పు చేశాడని ఎలా నిర్ధారించారు.

ఇంట్లో దొరికినంత మాత్రాన నా కొడుకే చేసినట్టా? మా వీధిలో ఎవరితోనూ మా వాడు మాట్లాడడు. తన పనేదో తాను చేసుకుంటాడు. మా అందరిని మూడు రోజులుగా అదుపులో ఉంచుకొని ఇబ్బంది పెట్టారు. రాత్రి హడావిడిగా పంపేశారు. రాజు దొరక్కపోతే ఎందుకు పంపుతున్నారని అడిగినా పోలీసులు చెప్పలేదు. రాజు మూడు రోజుల కిందటే పోలీసులకు దొరికాడని.. ఎన్‌కౌంటర్ చేయాలని ఆదేశాలు కూడా వచ్చాయని అనుకుంటుంటే విన్నాము” అని రాజు తల్లి చెప్పారు. పోలీసులపై తమకు అనుమానాలు ఉన్నాయని అన్నారు.

Child Family : రాజు మృతదేహాన్ని మాకు అప్పగించాల్సిందే

మూడు రోజులుగా స్టేషన్‌లో ఉంచినా ఒక్కరూ తమ దగ్గరికి రాలేదని.. నిన్న ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో పోలీసులు వచ్చి హడావిడిగా వివరాలు రాసుకుని వెళ్లారని ఆమె చెప్పారు. తమకు అనుమానం వచ్చి అడిగితే ఇంకా దొరకలేదని చెప్పారని అన్నారు.

”మిమ్మల్ని వదిలిపెడుతున్నాం అని చెప్పారు. రాత్రి పది గంటల సమయంలో ఉప్పల్‌లో వదిలిపెట్టి వెళ్లారు. రాత్రి అడ్డగూడూరు చేరుకునే సరికి మూడు గంటలైంది. మమ్మల్ని పంపించేసి ఉదయాన్నే రాజుని చంపేశారు. మా కొడుకును పోలీసులే ఉరికించి చంపేశారు” అంటూ ఆమె బోరున విలపించారు.

రాజు భార్య మౌనిక సైతం సంచలన ఆరోపణలు చేసింది. తన భర్తను పోలీసులు తీసుకెళ్లి హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది. తన భర్త మంచోడని, ఇలాంటి ఘోరాలు చేసే వ్యక్తి కాదని తెలిపింది. ఒకవేళ నిజంగా తన భర్త తప్పు చేస్తే చట్టపరంగా నిరూపించి శిక్షించాలని, ఇలా చంపేసి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పడం సరికాదని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త ఇన్ని రోజులు పోలీసుల అదుపులోనే ఉన్నాడని, అతడిని చిత్రహింసలకు గురిచేసి చంపేశారని మౌనిక విలపించింది.

HYD : సైదాబాద్ నిందితుడు రాజు ఆత్మహత్య

సైదాబాద్ చిన్నారి అత్యాచారం, హత్య కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హతమార్చిన కేసులో నిందితుడు పల్లికొండ రాజు ఈరోజు ఉదయం అనూహ్యంగా రైలు పట్టాలపై శవమై తేలాడు. ఉదయం 8.30 గంటల సమయంలో స్టేషన్ ఘన్‌పూర్ పరిధిలో రైల్వే ట్రాక్‌పై కోణార్క్ ఎక్స్‌ప్రెస్ కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి, మంత్రి కేటీఆర్ ట్వీట్ కూడా చేశారు.

సైదాబాద్ ఘటనపై హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ స్పందించారు. ”ఈ రోజు స్టేషన్ ఘన్ పూర్ దగ్గర రాజు మృతదేహం లభ్యమైంది. రైల్వే ట్రాక్ పై మృతదేహం పడి ఉందన్న సమాచారం వచ్చింది. నిందితుడి చేతిపై మౌనిక అని రాసి ఉంది. మరో చేతికి 5 స్టార్ మార్కులు ఉన్నాయి. కుటుంబ సభ్యులు రాజు మృతదేహాన్ని గుర్తించారు. గత 5-6 రోజులుగా రాజు కోసం రాష్ట్రమంతా తీవ్రంగా గాలించాం. పోలీసుల నుండి తప్పించుకోలేనని నిందితుడి మైండ్ లో పడిపోయింది. ఆ భయంతోనే రాజు ఆత్మహత్య చేసుకున్నాడు” అని సీపీ చెప్పారు.