Saravana Bhavan Case : రాజగోపాల్‌కి జీవిత ఖైదు

  • Published By: madhu ,Published On : March 29, 2019 / 07:31 AM IST
Saravana Bhavan Case : రాజగోపాల్‌కి జీవిత ఖైదు

Updated On : March 29, 2019 / 7:31 AM IST

శరవణ భవన్ కేసులో తీర్పు వచ్చింది. 2001లో జరిగిన మర్డర్ కేసు సంవత్సరాల తరబడి విచారణ జరిగింది. చివరకు 2019, మార్చి 29వ తేదీన సుప్రీంకోర్టు తీర్పును వెలువడించింది. శ‌ర‌వ‌ణ భ‌వ‌న్ హోట‌ల్స్ య‌జ‌మాని పి. రాజ‌గోపాల్‌కు జీవిత ఖైదు విధిస్తున్నట్లు, వెంటనే పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది సుప్రీం. ఓ వ్యక్తిని హత్య చేశారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. 2001లో ఈ హత్య జరిగింది. దీనిపై కేసు నమోదైంది.

శరవణ భవన్స్ హోటల్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేసే రామస్వామి పనిచేస్తుండే వాడు. ఈయనకు జీవజ్యోతి కుమార్తె ఉంది. ఈమెను రాజగోపాల్ పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఈ విషయాన్ని జ్యోతికి చెప్పాడు. వాస్తవానికి అప్పటికే రాజగోపాల్‌కు రెండు వివాహాలు జరిగాయి. మ్యారేజ్‌కు జ్యోతి నో చెప్పింది. 1999లో శాంతకుమార్‌ అనే వ్యక్తితో జ్యోతి వివాహం జరిగింది. అప్పటికే వీరిద్దరూ ప్రేమించుకున్నారని, వివాహానికి రామస్వామి అభ్యంతరం వ్యక్తం చేయడంతో వారు రిజిష్టర్ వివాహం చేసుకున్నారని తెలుస్తోంది.

పెళ్లి జరిగిన అనంతరం కొన్ని బెదిరింపులు కూడా వచ్చాయి. 2001లో దంపతులు పోలీసులకు కంప్లయింట్ చేశారు. కొన్ని రోజులకే శాంతాకుమార్ మృతదేహం అడవీలో లభ్యమైంది. పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సుదీర్ఘంగా జరిగిన విచారణ అనంతరం రాజగోపాల్‌కు జీవిత ఖైదు శిక్ష విధిస్తున్నట్లు సుప్రీం వెల్లడించింది. 20 దేశాల్లో శ‌ర‌వ‌ణ భ‌వ‌న్ హోట‌ల్స్ ఉన్నాయి. అమెరికా, బ్రిట‌న్‌, ఫ్రాన్స్‌, ఆస్ట్రేలియా దేశాల్లోనూ హోట‌ల్స్‌కు శాఖ‌లు ఉన్నాయి.