తమిళనాడులో తొక్కిసలాట : ఏడుగురు మృతి

తమిళనాడులో విషాదం నెలకొంది. తిరుచ్చిలోని తురయ్ లో కరుప్పుస్వామి రథోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. రథోత్సవ కార్యక్రమాన్ని తిలకించేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిలో మంది పిరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు.
రథం లాగేందుకు భక్తులు ఒకరినొకరు పోటీ పడటంతోనే తొక్కిసలాట జరిగింది. ఊపిరాడకపోవడంతోనే మరణించినట్లు తెలుస్తోంది. సరైన నిర్వహణ లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఏ మాత్రం జాగ్రత్తలు
తీసుకోలేదని తెలుస్తోంది. ఆస్పత్రి దగ్గర విషాద వాతావరణం నెలకొంది. గాయపడిన వారి హాహాకారాలు వినిపిస్తున్నాయి. తిరుచ్చి జిల్లా కలెక్టర్, అధికారులు ఆస్పత్రికి వెళ్లి పరిశీలించారు.