Shilpa Chowdary Case : శిల్పా చౌదరి-ముగిసిన మొదటిరోజు కస్టడీ

కిట్టీ పార్టీల పేరుతో సినీ ప్రముఖులతో పాటు పలువురు సెలబ్రిటీలను కోట్ల రూపాయలు మోసం చేసిన శిల్పా చౌదరి కేసులో మొదటి రోజు పోలీసు కస్టడీ ముగిసింది.

Shilpa Chowdary Case : శిల్పా చౌదరి-ముగిసిన మొదటిరోజు కస్టడీ

Shilpa Chowdary

Updated On : December 3, 2021 / 6:16 PM IST

Shilpa Chowdary Case : కిట్టీ పార్టీల పేరుతో సినీ ప్రముఖులతో పాటు పలువురు సెలబ్రిటీలను కోట్ల రూపాయలు మోసం చేసిన శిల్పా చౌదరి కేసులో మొదటి రోజు పోలీసు కస్టడీ ముగిసింది. శుక్రవారం ఉదయం 11 గంటల నుండి  సాయంత్రం 5 గంటల వరకు నార్సింగి   పోలీసులు ఆమెపై వివిధ ప్రశ్నలు సంధిస్తూ విచారణ చేశారు.

పోలీసుల  విచారణలో సమధానాలు చెప్పకుండా   పలుమార్లు శిల్పాచౌదరి  భోరున విలపించింది. శిల్పా   బినామీలు, బ్యాంక్ స్టేట్మెంట్‌లపై  పోలీసులు ఆరా తీసారు.  ఇప్పటి వరకు ఆమెపై   నమోదైన  ఫిర్యాదులు  ఆధారంగా  పోలీసులు విచారణ చేపట్టారు. శిల్పా చెప్పిన సమాధానాలను  పోలీసులు రికార్డు చేశారు.
Also Read : Burglar Arrested : అత్త ఇంటికే కన్నం వేసిన అల్లుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు
వివిధ సెలబ్రిటీల నుంచి తీసుకున్న కోట్ల రూపాయలను  శిల్పాచౌదరి  ఎక్కడికి తరలించిందనే కోణంలో మొదటి రోజు పోలీసు విచారణ సాగింది. ఆమె సెల్‌ఫోన్ లోని  కాల్‌డేటా ఆధారంగా కొంత మంది వ్యక్తులను పోలీసులు సంప్రదించారు. వారి గురించి చెప్పేందుకు  మొదట మొండికేసిన శిల్పా…. ఆదారాలు ముందు ఉంచేసరికి నోరు విప్పి సమాధానం చెప్పటం మొదలు పెట్టింది.

తనకు డబ్బు ఇచ్చిన వారు, చాలా మంది సెలబ్రిటీలు అప్పుగా ఇచ్చారని,  కొంతమంది బ్లాక్‌మనీని  ఇన్వెస్ట్‌మెంట్ల ద్వారా వైట్‌గా మార్చేందుకు ఇచ్చారని పోలీసులకు వివరించింది.