డేటా చోరీ కేసు : ఐటి గ్రిడ్స్ ఆఫీస్ లో సిట్ సోదాలు

  • Published By: veegamteam ,Published On : March 9, 2019 / 07:34 AM IST
డేటా చోరీ కేసు : ఐటి గ్రిడ్స్ ఆఫీస్ లో సిట్ సోదాలు

హైదరాబాద్ : డేటా చోరీ కేసులో విచారణను సిట్ వేగవంతం చేస్తోంది. మాదాపూర్ ఐటి గ్రిడ్స్ కార్యాలయంలో సిట్ బృందం సోదాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే ఐటీ గ్రిడ్స్ కార్యాలయాన్ని సీజ్ చేసిన విషయం తెలిసిందే. సీజ్ చేసిన ఐటి గ్రిడ్స్ కార్యాలయాన్ని ఓపెన్ చేశారు. క్లూస్ టీంతో మరోసారి సోదాలు చేస్తోంది. స్టీఫెన్ రవీంద్ర, సిట్ సభ్యులు శ్వేతారెడ్డి, రోహిణి ప్రియదర్శిని ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. 

గోశామహల్ పోలీస్ స్టేడియంలో సిట్ కార్యాలయం ఏర్పాటు చేశారు. స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో మరోసారి సిట్ బృందం సమావేశం కానుంది. బెంగళూరు నుంచి వచ్చిన ఎథికల్ హ్యాకర్స్, సైబర్ నిపుణులతో డేటా పరిశీలించనున్నారు. ఐటీ గ్రిడ్స్ నలుగురు ఉద్యోగులను సిట్ మరోసారి ప్రశ్నించనుంది. ఐటీ గ్రిడ్స్ ఎండీ అశోక్ వేసిన క్వాష్ పిటిషన్ పై న్యాయనిపుణుల సలహాలు కోరనుంది. సోమవారం పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలో ఎలా వ్యవహరించాలన్న దానిపై సమాలోచన చేస్తున్నారు.