రక్తమోడిన రహదారులు : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురి మృతి

తెలుగు రాష్ట్రాల్లో రహదారులు రక్తమోడాయి. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు.

  • Published By: veegamteam ,Published On : March 24, 2019 / 02:31 AM IST
రక్తమోడిన రహదారులు : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురి మృతి

Updated On : March 24, 2019 / 2:31 AM IST

తెలుగు రాష్ట్రాల్లో రహదారులు రక్తమోడాయి. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు.

సూర్యపేట : తెలుగు రాష్ట్రాల్లో రహదారులు రక్తమోడాయి. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందారు. సూర్యపేట జిల్లాలో రోడ్డు దాటుతున్న మహిళలపైకి లారీ దూసుకెళ్లడంతో నలుగురు మహిళలు మృతి చెందారు. మరో ముగ్గురు మహిళలు గాయపడ్డారు. మరోవైపు ప్రకాశం జిల్లాలో బొలెరో వాహనాన్ని బైక్ ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. 

వివరాళ్లోకి వెళ్తే… సూర్యపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలో వీరస్వామి పండుగ సందర్భంగా ఊరేగింపు నిర్వహించి పుట్ట బంగారం కోసం 15 మంది మహిళలు రోడ్డు పక్క నుంచి పుట్ట వద్దకు వెళ్తుండగా వేగంగా వచ్చిన లారీ వారిపైకి దూసుకెళ్లింది. దీంతో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను 108 వాహనంలో హుజూర్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

మృతులు గరిడేపల్లికి చెందిన మర్రి వెంకమ్మ, మర్రి ధనమ్మ, బేతవోలు గ్రామానికి చెందిన మట్టమ్మగా గుర్తించారు. వీరి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. ఆర్తనాదాలు మిన్నంటాయి. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ప్రకాశం జిల్లాలోని గిద్దలూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. బొలెరో వాహనాన్ని బైక్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు దుర్గ ప్రసాద్, చిన్న దుర్గగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ప్రశాంత్ ను కర్నూలు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.