Saif Ali Khan Stabbing Case : సల్మాన్ నుంచి సైఫ్ వరకు.. సినీ సెలబ్రిటీలపై పెరుగుతున్న దాడులు దేనికి సంకేతం? మళ్లీ భయం గుప్పిట్లోకి బాలీవుడ్..
నెమ్మదిగా ఎలాగో అలా బతికేస్తున్న బాలీవుడ్ ను వరుస ఘటనలు భయపెడుతున్నాయి. బిష్ణోయ్ తో పాటు కొత్త గ్యాంగ్ లు పుట్టుకొస్తున్నాయి.

Saif Ali Khan Stabbing Case : ఇంటి ముందు తుపాకీ పేల్చి భయపెడతాడు ఒకడు. ఇంట్లోకి వచ్చి కత్తితో దాడి చేస్తాడు ఇంకొకడు. మాఫియా పీడ వదిలి ఎలాగో అలా బతికేస్తున్న ముంబైని.. వరుస ఘటనలు భయపెడుతున్నాయి. బాలీవుడ్ హీరోల మీద దాడులు పెరగడంతో బాలీవుడ్ మరింత వణికిపోతోంది. వాడు పోతే వీడు, వీడు పోతే వాడు అన్నట్లుగా హీరోలకు చుక్కలు చూపిస్తున్నారు విలన్లు. సల్మాన్ నుంచి సైఫ్ అలీ ఖాన్ వరకు వరుస దాడుల చెబుతోంది ఇదే. సైఫ్ పై దాడి ఘటన వేకప్ కాల్ అని బాలీవుడ్ యాక్టర్లు ఎందుకు అంటున్నారు.
Also Read : వాడు వీడేనా? సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో మరొకరు అరెస్ట్..
యాక్టర్ సైఫ్ అలీఖాన్ పై దాడి ఘటనతో బాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ముంబైలో సంపన్నులు నివాసం ఉండే బాంద్రాలోని సైఫ్ ఇంట్లోకి జవరి 16న దుండగుడు దూరాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించగా పెనుగులాటలో కైఫ్ ను విచక్షణ రహితంగా కత్తితో పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు. 6 కత్తి పోట్లతో తీవ్రంగా గాయపడిన సైఫ్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఎమర్జెన్సీ ట్రీట్ మెంట్ ఇవ్వడతో ప్రాణాపాయం తప్పింది. సైఫ్ వెన్నుముకలో 2.5 అంగుళాల కత్తి విరగ్గా ఆపరేషన్ చేసి తొలగించారు డాక్టర్లు.
సరిగ్గా 40 ఏళ్ల కింద ఇంతకుమించి వణికిపోయింది బాలీవుడ్. గ్యాంగ్ స్టర్లు ఇండస్ట్రీని శాసించే వారు. దయా నాయక్ ఎంట్రీతో గ్యాంగ్ స్టర్ అనే వాడు లేకుండా పోయాడు. ఇప్పుడు నెమ్మదిగా ఎలాగో అలా బతికేస్తున్న బాలీవుడ్ ను వరుస ఘటనలు భయపెడుతున్నాయి. బిష్ణోయ్ తో పాటు కొత్త గ్యాంగ్ లు పుట్టుకొస్తున్నాయి. బాలీవుడ్ భయం పోయేది ఎలా? మళ్లీ దయా నాయక్ ఎంటర్ కావాల్సిందేనా?
Also Read : కోల్‌కతా డాక్టర్ హత్యాచారం కేసులో కోర్టు సంచలన తీర్పు..