హాజీపూర్ శ్రీనివాస్ రెడ్డికి ఉరి : పొక్సో కోర్టు సంచలన తీర్పు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన హాజీపూర్ వరుస హత్యల కేసులో పొక్సో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. వరుస హత్యల కేసులో దోషి శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష విధించింది. ముగ్గురు బాలికలపై అత్యాచారం చేసి, హత్య చేసినట్లు కోర్టు నిర్ధారించింది. ఇద్దరు బాలికల కేసులో ఉరి శిక్ష, మరో బాలిక కేసులో యావజ్జీవ శిక్ష విధిస్తున్నట్లు తీర్పు వెలువరించింది. శ్రీనివాస్ రెడ్డికి ఎటువంటి శిక్ష పడుతుందని చాలా మంది ఉత్కంఠగా ఎదురుచూశారు. అందరూ అనుకున్నట్లుగా శ్రీనివాస్ రెడ్డికి ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. నిజంగా ఇది సంచలన తీర్పుగా చెప్పవచ్చు.
నల్గొండలోని పొక్సొ స్పెషల్ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. మూడు కేసుల్లో శ్రీనివాస్ రెడ్డి నేరస్తుడిగా ఉన్నట్లు ప్రాసిక్యూషన్ నిరూపించిందని జడ్జి చెప్పారు. శిక్ష గురించి ఏమైనా చెప్పుకుంటావా అని శ్రీనివాస్ రెడ్డిని జడ్జి అడగ్గా,,,తనకు ఏమీ తెలియదని..కావాలని తనను ఇరికించారని శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు.
అంతకముందు హాజీపూర్ కేసులో నిందితుడు శ్రీనివాసరెడ్డి దోషిగా కోర్టు నిర్ధారించింది. నేరం రుజువైందని వెల్లడించింది. మూడు కేసుల్లో శ్రీనివాసరెడ్డి నేరస్తుడిగా ప్రాసిక్యూషన్ నిరూపించిందని న్యాయమూర్తి వెల్లడించారు. శిక్ష గురించి ఎమైనా చెప్పుకుంటావా అని జడ్జీ అడిగారు. తనకేం తెలియదని..ఇరికించారని ఏడూస్తూ చెప్పుకున్నాడు.
పోలీసులు హింసించారని, తన భూములు లాక్కొన్నారని కోర్టుకు తెలిపాడు. తన తల్లిదండ్రులు వృద్ధులు, ఎవరూ లేరని రోదిస్తూ చెప్పాడు. అయితే..వారు ఎక్కడున్నారో చెప్పాలని కోర్టు ప్రశ్నించింది. తల్లిదండ్రులు ఎక్కడున్నారో తెలియదని చెప్పాడు. భోజన విరామం తర్వాత శిక్ష ఖరారు చేయనున్నారు.
ఉదయం నుంచి బాధిత కుటుంబాలు, హాజీపూర్ గ్రామస్తులు తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. నేరం రుజువైందని కోర్టు చెప్పడంతోపాటు ఉరిశిక్ష విధించడం పట్ల బాధిత కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు పరిసర ప్రాంతంలో శ్రావణి, కల్పన, మనీషా ఫొటోలు పట్టుకుని వేచి చూశారు. నిందితుడు శ్రీనివాస రెడ్డికి ఉరి శిక్ష విధించాలని తాము కోరుతున్నట్లు, ఇతర కోర్టులకు అప్పీల్ చేయని విధంగా ఉండాలని ఆ కుటుంబాలు కోరుకున్నాయి.
* ఏప్రిల్ 25-2019 హాజీపూర్ గ్రామంలో విద్యార్థిని శ్రావణి మిస్సింగ్
* ఏప్రిల్ 25-2019 పోలీసులకు తల్లిదండ్రులు కంప్లయింట్
* ఏప్రిల్ 26-2019 శ్రావణి బొమ్మలరామారం వెళ్లినట్లు గుర్తింపు
* ఏప్రిల్ 26-2019 కీసర, బొమ్మలరామారం మార్గంలో గాలింపు
* ఏప్రిల్ 26-2019 పాడుబడ్డ బావి పక్కన శ్రావణి స్కూల్ బ్యాగ్ గుర్తింపు
* ఏప్రిల్ 27-2019 బావిలో శ్రావణి మృతదేహం లభ్యం
* ఏప్రిల్ 27-2019 పోలీసుల అదుపులో శ్రీనివాస్ రెడ్డి
* ఏప్రిల్ 27-2019 పోలీసుల విచారణలో నిజాలు వెల్లడి
* శ్రావణిపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు ఒప్పుకున్న శ్రీనివాస్ రెడ్డి
* 2015లో మైసిరెడ్డిపల్లికి చెందిన కల్పనను చంపేసినట్లు ఒప్పుకున్నాడు
* ఏప్రిల్ 30-2019 మిస్సింగ్ కేసులపై నిర్లక్ష్యం వహించిన పోలీసుల సస్పెన్షన్.
* మే 01-2019 కోర్టుకు శ్రీనివాస్ రెడ్డి.. రిమాండ్ విధించడంతో వరంగల్ సెంట్రల్ జైలుకు తరలింపు.
* జులై 31-2019 విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు
* ప్రాసిక్యూషన్, డిఫెన్స్ మధ్య వాదోపవాదాలు
* జనవరి 17-2020 వరుస హత్యల కేసులో ముగిసిన వాదనలు