Bilkis Bano case: బిల్కిస్ బానో కేసులో దోషుల ముందస్తు విడుదలపై సుప్రీం సంచలన నిర్ణయం

నితో పాటు బిల్సిస్ బానో కుటుంబ సభ్యులు ఏడుగురు ఊచకోతకు గురయ్యారు. వారిలో ఆమె ముడేళ్ల కూతురు కూడా ఉంది. ఈ కేసును సీబీఐ చేపట్టగా, తుదుపరి విచారణను మహారాష్ట్ర కోర్టుకు సుప్రీంకోర్టు బదిలీ చేసింది. 2008 జనవరి 21న సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ కేసులో 11 మందిని దోషులుగా నిర్ధారిస్తూ, యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

Bilkis Bano case: బిల్కిస్ బానో కేసులో దోషుల ముందస్తు విడుదలపై సుప్రీం సంచలన నిర్ణయం

Supreme Court assures listing of matter, setting up a special bench on Bilkis Bano case

Bilkis Bano case: బిల్కిస్ బానో కేసు(Bilkis Bano Case)లో దోషులను గడువుకు ముందే విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన నిర్ణయం తీసుకుంది. కేసు విచారణకు ప్రత్యేక ధర్మాసనాన్ని (Special Bench) ఏర్పాటు చేసేందుకు అత్యున్నత న్యాయస్థానం బుధవారం అంగీకరించింది. 2000 గుజరాత్ అల్లర్లలో సామూహిక అత్యాచారానికి గురై, ఏడుగురు కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధితురాలైన బిల్కిస్ బానోనే స్వయంగా సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. అత్యాచార కేసులో 11 మంది దోషులను గడువుకు ముందే బీజేపీ సారథ్యంలోని గుజరాత్ ప్రభుత్వం గత ఏడాది ఆగస్టు 15న విడుదల చేసిన విషయం తెలిసిందే.

Donald Trump: డొనాల్డ్ ట్రంపును అరెస్ట్ చేశారా? సోషల్ మీడియాలో వైరల్ ఫొటోలు

సుప్రీంకోర్టు నిర్దేశించిన చట్టపరమైన విధివిధాలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసి, యాంత్రికంగా దోషుల విడుదలకు ఆదేశాలిచ్చిందని తన పిటిషన్‌లో బిల్కిస్‌ బానో సుప్రీం దృష్టికి తీసుకు వచ్చారు. యావజ్జీవ శిక్ష పడిన దోషులను ముందస్తుగా విడిచిపెట్టడం తప్పుడు సంకేతాలకు తావిచ్చిందని పిటిషన్లో ఆమె పేర్కొన్నారు. గోద్రా రైలు(Godra rail)ను ఆందోళనకారులు తగులబెట్టిన అనంతరం చెలరేగిన అల్లర్లలో బిల్కిన్ బానో అత్యాచారానికి గురైంది. అప్పట్లో 21 ఏళ్ల వయస్సున్న ఆమె ఐదు నెలల గర్భవతి కూడా.

Governor Tamilisai Soundararajan : TSPSC పేపర్ లీక్ కేసు.. గవర్నర్ సీరియస్, హాట్ కామెంట్స్

దీనితో పాటు బిల్సిస్ బానో కుటుంబ సభ్యులు ఏడుగురు ఊచకోతకు గురయ్యారు. వారిలో ఆమె ముడేళ్ల కూతురు కూడా ఉంది. ఈ కేసును సీబీఐ చేపట్టగా, తుదుపరి విచారణను మహారాష్ట్ర కోర్టుకు సుప్రీంకోర్టు బదిలీ చేసింది. 2008 జనవరి 21న సీబీఐ ప్రత్యేక కోర్టు ఈ కేసులో 11 మందిని దోషులుగా నిర్ధారిస్తూ, యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ తీర్పును ఆ తర్వాత ముంబై హైకోర్టు, సుప్రీంకోర్టు ధ్రువీకరించాయి. జైలులో సత్ప్రవర్తన పేరుతో గుజరాత్ ప్రభుత్వం దోషుల విడుదలకు అనుమతించడంతో గోద్రా సబ్ జైలు నుంచి 2022, ఆగస్టు 15న విడుదలయ్యారు.