Kerala blasts: కేరళ పేలుడు నిందితుడు డొమినిక్ మార్టిన్ గురించి దిగ్భ్రాంతికర విషయాలు చెప్తున్న సన్నిహితులు

మార్టిన్ ప్రవర్తన చాలా బాగుందని అతను అన్నారు. అందుకు ఉదాహరణ చెబుతూ.. తాను ఇంటి అద్దె పెంచకపోయినా.. మార్టిన్ స్వయంగా రూ.1000 పెంచి తనకు చెల్లించాడని తెలిపాడు.

Kerala blasts: కేరళ పేలుడు నిందితుడు డొమినిక్ మార్టిన్ గురించి దిగ్భ్రాంతికర విషయాలు చెప్తున్న సన్నిహితులు

Updated On : October 30, 2023 / 6:32 PM IST

Kerala blasts: కేరళలోని కొచ్చిలో ఆదివారం జరిగిన పేలుళ్లతో రాష్ట్రం మొత్తం ఉళిక్కిపడింది. ఎర్నాకుళం జిల్లాలోని కలమస్సేరిలోని కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన మూడు పేలుళ్లలో ముగ్గురు మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడికి తానే సూత్రధారిణని డొమినిక్ మార్టిన్ అనే వ్యక్తి దాడి జరిగిన అనంతరమే హొస్సూర్ పోలీసుల ముందు లొంగిపోయారు. అయితే అతడి గురించి తెలిసిన వారు మాత్రం అతడు ఈ దాడికి పాల్పడ్డాడంటే నమ్మడం లేదు. తాను నిందితుడినంటూ పోలీసుల ముందు లొంగిపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

నిందితుడి పేరు వినగానే అతని పొరుగువారు చాలా మంది ఆశ్చర్యపోయారు. అతడు చాలా మంచివాడని వారు అంటున్నారు. ఐదేళ్లకు పైగా మార్టిన్ అద్దె ఇంట్లో ఉంటున్నాడని, అయితే అతను స్నేహపూర్వక స్వభావంతో ఉండేవాడని ఇంటి యజమాని జలీల్ తెలిపారు. మార్టిన్ ప్రవర్తన చాలా బాగుందని అతను అన్నారు. అందుకు ఉదాహరణ చెబుతూ.. తాను ఇంటి అద్దె పెంచకపోయినా.. మార్టిన్ స్వయంగా రూ.1000 పెంచి తనకు చెల్లించాడని తెలిపాడు.

ఇది కూడా చదవండి: Electoral Bonds: ప్రజలకు అన్నీ తెలుసుకునే హక్కు లేదు.. సుప్రీం ముందు కేంద్రం వాదన

మార్టిన్ 10వ తరగతి ఉత్తీర్ణుడయ్యాడని, అయితే మార్టిన్‌కు ఆంగ్ల భాషపై మంచి అవగాహన ఉందని, అందుకే తన ఇరుగుపొరుగు పిల్లలకు ఇంగ్లీషులో మాట్లాడటం నేర్పించాడని జలీల్ చెప్పాడు. కరోనా మహమ్మారి సమయంలో, మార్టిన్ ఎలక్ట్రికల్ ఫోర్‌మెన్‌గా పని చేయడానికి దుబాయ్‌కి వెళ్లాడని జలీల్ చెప్పాడు. అతని కుమారుడు బ్రిటన్‌లో చదువుతుండగా, అతని కుమార్తె కొచ్చిలో చదువుతోంది. కలమసేరిలోని అంతర్జాతీయ సమావేశ కేంద్రంలో జరిగిన పలు పేలుళ్లలో 50 మందికి పైగా గాయపడ్డారు. ఇందులో కొందరు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడులో ఐఈడీ ప్రయోగించిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది.