సుశాంత్‌‌ మృతికి కారణం ఇదే.. తెలియకుండా నిషేధిత డ్రగ్స్‌ ఇచ్చారు!

  • Published By: sreehari ,Published On : August 26, 2020 / 04:38 PM IST
సుశాంత్‌‌ మృతికి కారణం ఇదే.. తెలియకుండా నిషేధిత డ్రగ్స్‌ ఇచ్చారు!

Updated On : August 26, 2020 / 5:37 PM IST

హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది.. ఈ కేసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తికి సంబంధించి కొత్త విషయాలు బయటపడ్డాయి.. రియాకు డ్రగ్‌ మాఫియాతో సంబంధాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది.

సుశాంత్‌ తండ్రి తరపు ఫ్యామిలీ లాయర్ వికాస్ సింగ్ రియాపై మరో ఆరోపణ చేశారు.. రియా, సుశాంత్‌కు తెలియకుండా నిషేధించిన డ్రగ్స్‌ను ఇచ్చిందని FIR నమోదు చేశారన్నారు. లాయర్‌ కేకేసింగ్‌ మాట్లాడుతూ.. సుశాంత్‌కు తెలియకుండా కొన్ని నిషేధిత డ్రగ్స్‌ను ఇచ్చారని ఆరోపించారు.



అతడు చనిపోవడానికి డ్రగ్స్ కారణమని అన్నారు. సుశాంత్‌కు తెలియ కుండానే ఏదో మందులు ఇవ్వడంపై కుటుంబ సభ్యులకు అనుమానించారు.. ఇదే విషయాలను ప్రస్తావించారు. సుశాంత్‌కు తెలియకుండానే వైద్యులు రాయని ప్రిస్కిప్షన్‌లో డ్రగ్స్‌ను సుశాంత్‌కు ఇచ్చారని ఫిర్యాదు చేశారని తెలిపారు.

అలాంటి డ్రగ్స్‌ ఇచ్చి సుశాంత్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించారా లేదా హత్య చేయడానికి ప్రయత్నించారా అన్నదానిపై సుశాంత్ తండ్రి తరుపు న్యాయవాది అనుమానం వ్యక్తం చేశారు.నిషేధిత డ్రగ్స్ వాడకం చట్టవిరుద్ధమన్నారు.



సుశాంత్‌ ఫస్ట్‌ ఫ్లోర్‌లో నిద్రపోయేవాడని రియా‌పై అంతస్తులో పార్టీలు చేసుకునేదని ఇంట్లో ఉండే పనివాళ్లు చెప్పారంట.. రియా డ్రగ్‌ డీలర్స్‌తో మాట్లాడటమే కాదు.. వాళ్లకు మెసేజ్‌లు కూడా చేసినట్లు కొన్ని ఆధారాలను ఈడీ డిపార్ట్‌మెంట్‌ సీబీఐకు అందించింది.

డ్రగ్స్‌ లింక్‌ గురించి రియా తరుపు న్యాయవాది కూడా తీవ్రంగా కొట్టిపారేశారు.. రియాకు కావాలంటే బ్లడ్ టెస్ట్ చేయొచ్చునని అన్నారు. రియా ఎప్పుడూ కూడా డ్రగ్స్‌ తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు..