దేశంలోకి చొరబడ్డ ముష్కరులు.. అనుమానిత ఉగ్రవాది అరెస్టు

లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఆరుగురు శ్రీలంక మీదుగా దేశంలోకి ప్రవేశించారని నిఘా వర్గాలు హెచ్చరించటంతో దక్షిణాది రాష్ట్రాల్లో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.

  • Published By: chvmurthy ,Published On : August 24, 2019 / 01:50 PM IST
దేశంలోకి చొరబడ్డ ముష్కరులు.. అనుమానిత ఉగ్రవాది అరెస్టు

Updated On : August 24, 2019 / 1:50 PM IST

లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఆరుగురు శ్రీలంక మీదుగా దేశంలోకి ప్రవేశించారని నిఘా వర్గాలు హెచ్చరించటంతో దక్షిణాది రాష్ట్రాల్లో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.

కేరళ : లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఆరుగురు శ్రీలంక మీదుగా దేశంలోకి ప్రవేశించారని నిఘా వర్గాలు హెచ్చరించటంతో దక్షిణాది రాష్ట్రాల్లో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. తమిళనాడు, కేరళ, ఏపీల్లోని ప్రధాన నగరాల్లో పోలీసు తనిఖీలు చేపట్టారు. ఉగ్రవాదులు కొయంబత్తూరు లో విధ్వంసం సృష్టించేందుకు అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో సముద్ర తీరప్రాంతాల్లో పోలీసుల గస్తీని పెంచారు. నిఘా వర్గాల హెచ్చరికలతో తమిళనాడు వ్యాప్తంగా పబ్లిక్ ప్రదేశాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు.

కాగా… కేరళలో చేపట్టిన తనిఖీల్లో  ఖాదర్ రహీం అనే వ్యక్తిని  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖాదర్ రహీం కేరళలోని కొడంగలూరు వాసిగా గుర్తించారు. ఖాదర్ రహీం వెంటవున్న మహిళను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఖాదర్ రహీం రెండురోజుల క్రితం బహ్రెయిన్ నుంచి “కొచ్చి” వచ్చినట్లు సమాచారం. నిందితుడు ఎన్‌ఐఏ కోర్టులో లొంగిపోయేందుకు వచ్చినప్పుడు అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

చెన్నై,కోయంబత్తూర్ సహా, కేరళలోని పలు ప్రధాన నగరాల్లో సాయుధ పోలీసులను మోహరించి సోదాలు ముమ్మరం చేశారు. అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ప్రార్థనాలయాలు, పర్యాటక ప్రాంతాలు, విదేశీ రాయబార కార్యాలయాలే ఉగ్రవాదుల టార్గెట్ అని ఇంటలిజెన్స్ అధికారులు హెచ్చరించారు.  

గురువారం అర్దరాత్రి నుంచి సాయుధ పోలీసులు ప్రార్థనాలయాలు, లాడ్జీలు, బహిరంగ స్థలాల్లో తనిఖీలు జరిపారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. కాగా తమిళనాడు రాష్ట్రంలోకి చొరబడ్డ ఆరుగురు ఉగ్రవాదుల్లో ఒకరు పాకిస్తానీ కాగా.. మరో ఐదుగురు శ్రీలంక ముస్లింలుగా ఇంటెలిజెన్స్ తెలిపింది.