Shameful Incident: కూతురిపై తండ్రి అత్యాచారం.. పోక్సో చట్టం కింద కేసు నమోదు
సభ్య సమాజం తలదించుకునే సంఘటన కోయంబత్తూరు జిల్లాలోని అన్నూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

Drunk Man Rapes 10 Year Old Daughter In Wife’s Absence
Shameful Incident: సభ్య సమాజం తలదించుకునే సంఘటన కోయంబత్తూరు జిల్లాలోని అన్నూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. భార్య పనికి వెళ్లిన సమయంలో ఫూటుగా మద్యం తాగిన 37ఏళ్ల వ్యక్తి మద్యం మత్తులో కామాంధుడిలా మారి కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కసాయి తండ్రి.
ఐదో తరగతి చదివే పదేళ్ల కూతురిని అత్యాచారం చేయగా.. తల్లి ఇంటికి రాగానే బాలిక జరిగిన విషయాన్ని ఆమెకు చెప్పింది. దీంతో ఆమె తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
కంటికి రెప్పలా కాపాడుకోవల్సిన కూతురిపై దారుణానికి పాల్పడ్డ వ్యక్తికి కఠినంగా శిక్షలు వెయ్యాలంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని ప్రత్యేక పోక్సో కోర్టులో హాజరుపరిచి పల్లడం సబ్ జైలులో జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.