Drugs Tracking In Hyderabad : డ్రగ్స్ అమ్ముతూ అడ్డంగా బుక్ అయిన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గోపీకృష్ణ

హైదరాబాద్ నగరంలోని మియాపూర్ లో డ్రగ్స్ అమ్మకాలు కలకలం సృష్టించాయి. నిషేధిత డ్రగ్స్​ మాత్రలతో గోపీకృష్ణ అనే అసిస్టెంట్​ కొరియోగ్రాఫర్​ ఎస్ఓటీ పోలీసులకు అడ్డంగా బుక్ అయ్యాడు.

Drugs Tracking In Hyderabad : డ్రగ్స్ అమ్ముతూ అడ్డంగా బుక్ అయిన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గోపీకృష్ణ

drugs tracking In Hyderabad 

Updated On : August 27, 2022 / 11:30 AM IST

drugs tracking In Hyderabad  : హైదరాబాద్ నగరంలోని మియాపూర్ లో డ్రగ్స్ అమ్మకాలు కలకలం సృష్టించాయి. నిషేధిత డ్రగ్స్​ మాత్రలతో గోపీకృష్ణ అనే అసిస్టెంట్​ కొరియోగ్రాఫర్​ ఎస్ఓటీ పోలీసులకు అడ్డంగా బుక్ అయ్యాడు. నిందితునిపై పలు సెక్షన్​ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి నుంచి రూ.55వేల విలువ చేసే 10 గ్రాముల ఎండీఎంఏ టాబ్లెట్స, హ్యాష్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు.

మాదక ద్రవ్యాల సరఫరా.. వినియోగం నియంత్రణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. డేగ కళ్లతో అధికారులు నిఘా పెడుతున్నాయి. అయినా యదేచ్చగా మాదకద్రవ్యాల విక్రయాలు జరిగిపోతున్నాయి. ఈక్రమంలో నిషేధిత డ్రగ్స్ విక్రయిస్తున్న అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గోపికృష్ణ పట్టుబడ్డ ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హఫీజ్ పేట్ గోకుల్ ప్లాట్స్​లో చోటుచేసుకుంది.

దొమ్మరాజు గోపికృష్ణ అనే వ్యక్తి నిషేధిత ఎండిఎం ఏ డ్రగ్స్ ను ఓ వ్యక్తికి విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నామని మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు తెలిపారు. అతని వద్ద నుంచి 55వేల రూపాయల విలువచేసే పది నిషేధిత డ్రగ్స్ మాత్రలు, ఓ సెల్ ఫోన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నామన్నారు. పోలీసులు ఎన్​డీపీఎస్​ యాక్ట్ కింద, ఎస్ ఓటి పోలీసులు కేసు‌ నమోదు చేశారు. గోవానుంచి తీసుకొచ్చి హైదరాబాద్ లో డ్రగ్స్ అమ్ముతున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది.