Telangana : సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
Suryapet Road Accident : అంజనాపురి చౌరస్తా వద్ద ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొట్టింది. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన కారు అదే ఆటోను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

Telangana : Four dead, 15 injured in accident in Suryapet District
Suryapet Road Accident : తెలంగాణ రాష్ట్రంలోని సూర్యపేట జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. లారీని ఆటో ఢీకొట్టిన సమయంలో వెనుక నుంచి దూసుకొచ్చిన కారు అదే ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు.
మరో 15 మందికి తీవ్రగాయాలయ్యాయి. జిల్లా కేంద్రంలోని హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై ఈ రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది.
ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుల్లో చిన్నారులు ఉండగా, అత్యవసర చికిత్స నిమిత్తం సమీపంలోని సూర్యాపేట జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించారు.
అంజనాపురి చౌరస్తా నుంచి పట్టణంలోకి వస్తుండగా ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొట్టింది. అదే సమయంలో వెనుక నుంచి కారు ఆటోను ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని పోలీసులు పేర్కొన్నారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
Read Also : Bandi Sanjay : ప్రజల్లో చాలా వ్యతిరేకత మొదలైంది- కాంగ్రెస్ ప్రభుత్వంపై బండి సంజయ్ ఫైర్