Bandi Sanjay : ప్రజల్లో చాలా వ్యతిరేకత మొదలైంది- కాంగ్రెస్ ప్రభుత్వంపై బండి సంజయ్ ఫైర్

100 రోజుల పాలనపై మాట్లాడిన బీఆర్ఎస్ నేతలు ఆరు గ్యారెంటీలపై ఎందుకు మాట్లాడం లేదు.

Bandi Sanjay : ప్రజల్లో చాలా వ్యతిరేకత మొదలైంది- కాంగ్రెస్ ప్రభుత్వంపై బండి సంజయ్ ఫైర్

Bandi Sanjay : కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై ఫైర్ అయ్యారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. ఆ రెండు పార్టీలు ఒక్కటేనన్న బండి సంజయ్.. రెండూ కలిసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ ఫోన్ ట్యాపింగ్ అంటే, బీఆర్ఎస్ నీళ్లు ఇవ్వడం లేదంటుంది.. రెండు పార్టీలు కలిసి డ్రామాలు ఆడుతున్నాయని బండి సంజయ్ విరుచుకుపడ్డారు.

”యాత్రలో తిరుగుతుంటే తెలుస్తుంది. కాంగ్రెస్ పైన చాలా వ్యతిరేకత మొదలైంది. ఆరు గ్యారెంటీల అమలుపై చర్చ నడుస్తోంది. మహిళలకు 2వేల 500 ఇవ్వడం లేదు అంటున్నారు. 4వేల పెన్షన్ ఎక్కడ అని పెన్షనర్స్ అడుగుతున్నారు. రైతు భరోసా 15వేలు ఎక్కడ? అని రైతులు అంటున్నారు. 15వేలు ఇవ్వడం లేదని వ్యవసాయ కూలీలు అడుతున్నారు. వడ్లకు 500 బోనస్ ఇవ్వలేదు. వీటన్నింటిపైన ప్రజల్లో వ్యతిరేకత ఉంది.

కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయి. 100 రోజుల పాలనపై మాట్లాడిన బీఆర్ఎస్ నేతలు ఆరు గ్యారెంటీలపై ఎందుకు మాట్లాడం లేదు. కాంగ్రెస్ కాళేశ్వరం అంటే బీఆర్ఎస్ కృష్ణ వాటర్ అంటుంది. కాంగ్రెస్ ఫోన్ ట్యాపింగ్ అంటే బీఆర్ఎస్ నీళ్ళు ఇవ్వడం లేదు అంటుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయి” అని ధ్వజమెత్తారు బండి సంజయ్.

Also Read : పెద్దపల్లిలో బస్తీమే సవాల్‌.. ఈ ముగ్గురిలో విక్టరీ కొట్టేదెవరు?