Fake Passport Scam : నకిలీ పాస్‌పోర్టుల స్కాం కేసులో సీఐడీ దర్యాప్తు ముమ్మరం.. మరో నలుగురు అరెస్ట్..!
Telangana Passport Fraud Case : నకిలీ పత్రాలతో పాస్‌పోర్ట్‌లు సృష్టించిన కేసులో దర్యాప్తును సీఐడీ ముమ్మరం చేసింది. తాజాగా నకిలీ పాస్ట్‌పోర్ట్ జారీ కేసుకు సంబంధించి మరో నలుగురిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.

Telangana Passport Fraud Case
Fake Passport Scam : తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన నకిలీ పాస్‌పోర్టు స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. నకిలీ పత్రాలతో పాస్‌పోర్ట్‌లు సృష్టించిన కేసులో దర్యాప్తును సీఐడీ ముమ్మరం చేసింది. తాజాగా నకిలీ పాస్ట్‌పోర్ట్ జారీ కేసుకు సంబంధించి మరో నలుగురిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.
ఈ కేసులో ఇప్పటికే 18 మందిని సీఐడీ అరెస్ట్ చేయగా.. తాజా అరెస్టులతో మొత్తం 22 మంది అరెస్ట్ అయ్యారు. ఇప్పటివరకూ హైదరాబాద్‌కు చెందిన ఏజెంట్ కల్యాణ్‌తో పాటు మొత్తం ముగ్గురు ఏఎస్ఐలను సీఐడీ అదుపులోకి తీసుకుంది.
Read Also : మోదీ సర్కారు సంచలన నిర్ణయం.. సీఏఏ అమలుకు నోటిఫికేషన్ జారీ
అరెస్ట్ అయినవారిలో మారేడ్ పల్లి ట్రాఫిక్ ఏఎస్సై తిప్పన్న, పంజాగుట్ట ట్రాఫిక్ పీఎస్ ఏఎస్సై నజీర్ బాషా, షీటీమ్స్ ఏఎస్సై వెంకటేశ్వర్లు ఉన్నారు. 125 మంది శ్రీలంక రిప్యూజీలకు సంబంధించిన పాస్‌పోర్టులను నకిలీ పత్రాలతో జారీ చేసినట్టు సీఐడీ దర్యాప్తులో గుర్తించింది. నకిలీ పాస్‌పోర్టు, వీసాలను వెంటనే రద్దు చేయాలని కోరుతూ పాస్‌పోర్ట్, ఇమ్మిగ్రేషన్ శాఖలకు సీఐడీ అధికారులు వివరాలను పంపారు.
Read Also : Bjp Focus On Telangana : టార్గెట్ 17.. తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్, రంగంలోకి అగ్రనేతలు