Bjp Focus On Telangana : టార్గెట్ 17.. తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్, రంగంలోకి అగ్రనేతలు

నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ తో పాటు మల్కాజిగిరి, హైదరాబాద్, సికింద్రాబాద్ ను కలిపి బహిరంగ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Bjp Focus On Telangana : టార్గెట్ 17.. తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్, రంగంలోకి అగ్రనేతలు

Bjp Focus On Telangana

Bjp Focus On Telangana : తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్ పెట్టింది. లోక్ సభ ఎన్నికలే టార్గెట్ గా బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఈ ఎన్నికల్లో 17 లోక్ సభ స్థానాలు గెలవడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా బీజేపీ అగ్ర నేతలు తెలంగాణకు క్యూ కడుతున్నారు. రేపు(మార్చి 12) కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. ఎల్బీ స్టేడియంలో బీజేపీ బూత్ స్థాయి అధ్యక్షుల సమ్మేళనంలో అమిత్ షా పాల్గొంటారు.

ఈ నెల 16న ప్రధాని నరేంద్ర మోదీ కూడా తెలంగాణలో పర్యటించనున్నారు. 16, 18, 19 తేదీల్లో మూడు రోజుల పాటు బిజీబిజీగా గడపనున్నారు. కొన్ని రోజుల క్రితమే ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాలలో భారీ బహిరంగ సభలు నిర్వహించారు ప్రధాని మోదీ. కరీంనగర్, నిజామాబాద్ కలిపి జగిత్యాల సభ నిర్వహించనుంది కమలం పార్టీ. నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ తో పాటు మల్కాజిగిరి, హైదరాబాద్, సికింద్రాబాద్ ను కలిపి బహిరంగ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

కమలం వ్యూహాలు
* తెలంగాణపై బీజేపీ ఫుల్ ఫోకస్
* లోక్ సభ ఎన్నికలే టార్గెట్ గా వ్యూహాలు
* ఈ ఎన్నికల్లో 17 ఎంపీ స్థానాలు గెలవటమే లక్ష్యం
* తెలంగాణకు బీజేపీ అగ్రనేతలు క్యూ
* రేపు కేంద్రహోంమంత్రి అమిత్ షా పర్యటన
* ఎల్బీ స్టేడియంలో బీజేపీ బూత్ స్థాయి అధ్యక్షుల సమ్మేళనం
* ఈ నెల 16, 18, 19 తేదీల్లో తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన
* భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు ప్రణాళికలు
* ఆపరేషన్ ఆకర్ష్ స్పీడ్ పెంచిన కమలం పార్టీ
* ఇప్పటికే కమలం గూటికి చేరిన పలువురు బీఆర్ఎస్ నేతలు
* బీజేపీ కండువా కప్పుకున్న సీతారాం నాయక్, నగేశ్, సైదిరెడ్డి, జలగం వెంకట్రావు
* బీఆర్ఎస్ నుంచి మరికొందరు బీజేపీలో చేరతారని ప్రచారం

Also Read : పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారానికి బీఆర్ఎస్ సరికొత్త వ్యూహం.. కారణం అదేనా?