House Teacher Punished Student : సిక్ లీవ్ తర్వాత ఆలస్యంగా వచ్చిందని 5రోజులు హాస్టల్ ముందు నిలబెట్టిన హౌస్ టీచర్..చచ్చుబడిపోయిన విద్యార్థిని కాళ్లు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం జరిగింది. సిక్ లీవ్ తర్వాత హాస్టల్‌కు ఆలస్యంగా వచ్చిందని విద్యార్థినికి హౌస్ టీచర్ పనిష్‌మెంట్ ఇచ్చింది. ఐదురోజులు హాస్టల్ ముందు నిలబెట్టింది. దీంతో ఆ విద్యార్థిని కాళ్లు చచ్చుబడిపోయాయి. ప్రస్తుతం ఆ విద్యార్థిని నడవలేని స్థితిలో ఉంది.

House teacher punished student
House Teacher Punished Student : రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం జరిగింది. సిక్ లీవ్ తర్వాత హాస్టల్‌కు ఆలస్యంగా వచ్చిందని విద్యార్థినికి హౌస్ టీచర్ పనిష్‌మెంట్ ఇచ్చింది. ఐదురోజులు హాస్టల్ ముందు నిలబెట్టింది. దీంతో ఆ విద్యార్థిని కాళ్లు చచ్చుబడిపోయాయి. ప్రస్తుతం ఆ విద్యార్థిని నడవలేని స్థితిలో ఉంది. దీంతో ఆమెను చికిత్స కోసం వేములవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీలో విద్యార్థిని బీకాం చదువుతుంది.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రేగడ్డ మద్దికుంటకు చెందిన నిహారిక.. వేములవాడ సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీలో బీకాం చదువుతోంది. ఇటీవల ఆమె అనారోగ్యానికి గురికావడంతో ఇంటికి వెళ్లింది. ట్రీట్‌మెంట్ తర్వాత రెండు రోజులు ఆలస్యంగా కాలేజీ హాస్టల్‌కు వచ్చింది. దీంతో రెండు రోజులు ఆలస్యంగా వచ్చావంటూ విద్యార్థినిపై హౌస్ టీచర్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆమెను ఐదురోజుల నుంచి కాలేజీకి వెళ్లనీయకుండా హాస్టల్ బయటే నిలబెట్టింది. వరుసగా ఐదు రోజులు విద్యార్థిని నిలబడి ఉండటంతో ఆమె కాళ్లు మొద్దుబారిపోయాయి. స్పర్శ తెలియడం లేదు. నడవలేనిస్థితిలో ఉన్న నిహారికను హాస్టల్ లోని ఆరోగ్య సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.