Drugs Gang Arrested : డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురు అరెస్ట్

మేడ్చల్ జిల్లా  ఘట్కేసర్  పోలీస్ స్టేషన్ పరిధిలో ఘట్కేసర్‌   ఓ.అర్.అర్  అండర్ బ్రిడ్జి వద్ద డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. 

Drugs Gang Arrested : డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురు అరెస్ట్

Ghatkesar Drugs Seize

Updated On : December 15, 2021 / 7:59 PM IST

Drugs Gang Arrested :  మేడ్చల్ జిల్లా  ఘట్కేసర్  పోలీస్ స్టేషన్ పరిధిలో ఘట్కేసర్‌   ఓ.అర్.అర్  అండర్ బ్రిడ్జి వద్ద డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.  వీరు నగరంలోని మెహిదీపట్నం, హాఫిజ్ పేట్,అల్మాస్‌గూడ ప్రాంతాలకు చెందిన ఏం.డి జమీర్ (28),పులి రమ్య(32 )మరియు కే.అనిల్ (31) గా గుర్తించారు.

క్లబ్ హౌస్ అనే ఆన్‌లైన్  యాప్ ద్వారా వీరు పలువురికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు  తెలుస్తోంది.  వీరి వద్ద నుండి MDMA, LSD, గంజాయి తదితర మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు ఒక  కారును కూడా స్వాధీనం చేసుకుని వీరి ముగ్గురి పై   22,27,29 NDPS సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Also Read : AP CM YS Jagan : గవర్నర్ దంపతులను పరామర్శించిన సీఎం జగన్ దంపతులు