Lift Incident : బంతి తీసే ప్రయత్నంలో ఘోరం.. లిఫ్ట్ కింద తల నలిగి దుర్మరణం..
అదే సమయంలో లిఫ్ట్ కిందకు రావడంతో తలకు తీవ్ర గాయమై మరణించారు.

Lift Incident : మేడ్చల్ జిల్లా సూరారంలోని శ్రీకృష్ణనగర్ లో ఘోరం జరిగింది. లిఫ్ట్ మీద పడి ఆర్ఎంపీ డాక్టర్ మరణించారు. లిఫ్ట్ గుంతలో పడిన బంతిని తీసే ప్రయత్నం చేశారు అక్బర్ పటేల్. అయితే అదే సమయంలో లిఫ్ట్ కిందకు రావడంతో తలకు తీవ్ర గాయమై మరణించారు.
అపార్ట్ మెంట్ లో జరిగిన లిఫ్ట్ ప్రమాదంలో ఆర్ఎంపీ డాక్టర్ దుర్మరణం చెందారు. లిఫ్ట్ గుంతలో ఉన్న బంతిని తీసే క్రమంలో ఒక్కసారిగా లిఫ్ట్ ఆన్ చేయడంతో.. లిఫ్ట్ కిందకు వచ్చింది. తల నలిగిపోయింది. స్పాట్ లోనే చనిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. అపార్ట్ మెంట్ ఆవరణలో పిల్లలు ఆడుకుంటున్నారు. వారి బాల్ వెళ్లి లిఫ్ట్ గుంతలో పడింది. బాల్ తీయాలని అక్బర్ పటేల్ గుంతలోకి వంగారు. సరిగ్గా లిఫ్ట్ ఆన్ చేయడంతో అది కిందకు వచ్చి ఘోరం జరిగిపోయింది.
Also Read : సోషల్ మీడియాలో లీక్.. మహిళ ప్రాణం తీసిన ప్రైవేట్ వీడియో వివాదం.. నరసరావుపేటలో దారుణం..
సూరారం లిఫ్ట్ ప్రమాదానికి బిల్డర్ తప్పిదమే కారణం అంటున్నారు స్థానికులు. లిఫ్ట్ చుట్టు మూడు వైపుల గోడలు తెరిచి ఉన్నాయని, కనీసం షీట్ కూడా వేయలేదని, ఇదే ఘోర ప్రమాదానికి కారణం అంటున్నారు. చనిపోయిన అక్బర్ చాలా మంచి వ్యక్తి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకృష్ణనగర్ మణికంఠ అపార్ట్ మెంట్ లోని సెల్లార్ లో పిల్లలు క్రికెట్ ఆడుతుండగా.. బాల్ లిఫ్ట్ గుంతలో పడిపోయింది. ఇదే విషయాన్ని పిల్లలు అక్బర్ కు చెప్పగా.. గుంతలో ఉన్న బంతిని తీసే ప్రయత్నం చేశారు అక్బర్ పటేల్.
అదే సమయంలో ఐదవ అంతస్తు నుంచి లిఫ్ట్ కిందకు రావడంతో తలకు తీవ్రగాయమై అక్బర్ చనిపోయారు. అక్బర్ స్థానికంగా ఆర్ఎంపీ డాక్టర్ గా పని చేస్తున్నారు. చుట్టుపక్కల వారికి వైద్య సాయం చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. పేదలకు తక్కువ ఫీజు తీసుకునే వారు. ఉచితంగానూ వైద్య సాయం అందించే వారని స్థానికులు చెబుతున్నారు. అలాంటి మంచి వ్యక్తి ఇలా చనిపోవడం బాధాకరం అంటున్నారు. ఇదంతా బిల్డర్ తప్పిదమేనని మండిపడుతున్నారు. లిఫ్ట్ చుట్టూ గోడలు ఓపెన్ ఉంచడం, తగిన రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్లే ప్రాణం పోయిందని ఆరోపిస్తున్నారు. బిల్డర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.