విశాఖలో విషాదం : కల్తీ కల్లుతాగి  అయిదుగురి మృతి 

  • Published By: chvmurthy ,Published On : February 24, 2019 / 12:19 PM IST
విశాఖలో విషాదం : కల్తీ కల్లుతాగి  అయిదుగురి మృతి 

Updated On : February 24, 2019 / 12:19 PM IST

విశాఖపట్నం: విశాఖ జిల్లా గాజువాక నియోజక వర్గం పెద గంట్యాడ మండలం స్వతంత్ర నగర్ లో విషాదం చోటు చేసుకుంది. కల్తీ కల్లు తాగి అయిదుగురు మృతి చెందారు. మరో 15 మంది  అస్వస్ధతకు గురైనట్లు తెలుస్తోంది. శనివారం సాయంత్రం ఒక గ్రామ దేవత పండుగ సందర్భంగా, నల్ల కంటెయినర్లో తెచ్చిన నిల్వ ఉన్న మద్యాన్ని చాలామంది తాగారు. వారిలో తీవ్ర అస్వస్థతకు గురైన 15 మందిని విశాఖ కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందించారు. చికిత్సపొందుతూ అసనాల రమణమ్మ(70), కొండోడు(65) వాడపల్లి అప్పడు(65), సండ్ర అప్పలమ్మ(60) మృతి చెందారు. 

బాధితులంతా పందుల పెంపకం దారులుగా గుర్తించారు. పోలీసులు, అధికారులూ మాత్రం దీన్ని ప్రమాదంగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. కల్తీ మద్యం అయితే చాలా పెద్ద కేసు అవుతుంది. కనుక వేరే ద్రవాన్ని పొరబాటున తాగారని ప్రచారం చేస్తున్నారు.  పోలీసులు, ఎక్సైజ్ అధికారులు కంటెయినర్లో ఉన్న ద్రవ పదార్ధాన్నిపరీక్ష నిమిత్తం స్వాధీనం చేసుకున్నారు. ఒక పక్క అసోంలో కల్తీ మద్యానికి 150 మంది బలైన నేపధ్యంలో గాజువాక సంఘటన ఆందోళన రేకెత్తిస్తోంది.