Drugs Case : టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్..

టాలీవుడ్ డ్రగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచనుంది. ఇంతకు ముందు రాష్ట్రప్రభుత్వం చేసిన విచారణ నివేదికలను స్వాధీనం చేసుకున్న ఈడీ వాటిని పరిశీలిస్తోంది.

Drugs Case : టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్..

Tollywood Drugs Case

Updated On : March 29, 2022 / 12:38 PM IST

Tollywood Drugs Case : టాలీవుడ్ డ్రగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచనుంది. ఇంతకు ముందు రాష్ట్రప్రభుత్వం చేసిన విచారణ నివేదికలను స్వాధీనం చేసుకున్న ఈడీ వాటిని పరిశీలిస్తోంది. ఈడీ, కోర్టు ధిక్కారణ పిటీషన్ వేయటంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చి ఈడీ అడిగిన వివరాలన్నీ ఇవ్వటంతో ఈడీ కోర్టు ధిక్కరణ పిటీషన్ను వెనక్కి తీసుకుంది.

ప్రభుత్వం ఈడీ అడిగిన అన్నివివరాలు ఇచ్చి హైకోర్టు రిజిస్టర్ కు మెమో దాఖలు చేసింది. ఈ రికార్డుల ఆధారంగా ఈడీ మరోసారి టాలీవుడ్ ప్రముఖులను విచారించనుంది. ఎక్సైజ్ శాఖ ఇచ్చిన డిజిటల్ రికార్డ్స్ కాల్ డేటాను ఈడీ పరిశీలిస్తోంది. డ్రగ్స్ లావాదేవీలు, డ్రగ్స్ కొనుగోళ్లు, మనీల్యాండరింగ్ అంశాలపై మరోసారి టాలీవుడ్ ప్రముఖులను విచారించి కూపీ లాగునుంది.

Also Read : Online Cinema Tickets : ఏప్రిల్ 1 నుంచి ఆన్లైన్‌లో సినిమా టిక్కెట్లు.. మొత్తం రెడీ అంటున్న ఏపీ ప్రభుత్వం..